AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9 లక్షల మంది మిస్సింగ్.. ​ మస్క్​కి ఫిర్యాదు చేసిన బాలీవుడ్ స్టార్​ నటుడు! ఏం జరిగింది

సోషల్ మీడియా వేదికగా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండే ఒక సీనియర్ బాలీవుడ్ నటుడికి ఇటీవల ఊహించని షాక్ ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది యూజర్లను కలిగి ఉన్న ప్రముఖ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'X' (గతంలో ట్విట్టర్)లో ఆయనకు చేదు అనుభవం ..

9 లక్షల మంది మిస్సింగ్.. ​ మస్క్​కి ఫిర్యాదు చేసిన బాలీవుడ్ స్టార్​ నటుడు! ఏం జరిగింది
Star Of Bollywood
Nikhil
|

Updated on: Dec 05, 2025 | 9:11 AM

Share

సోషల్ మీడియా వేదికగా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండే ఒక సీనియర్ బాలీవుడ్ నటుడికి ఇటీవల ఊహించని షాక్ ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది యూజర్లను కలిగి ఉన్న ప్రముఖ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘X’ (గతంలో ట్విట్టర్)లో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. తన ఖాతా నుండి ఫాలోవర్లు ఒక్కసారిగా భారీ సంఖ్యలో మాయం కావడాన్ని గమనించిన ఆ నటుడు… ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఏకంగా X అధినేత ఎలన్ మస్క్‌కే నేరుగా ఫిర్యాదు చేస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు బీ-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

కేవలం 15 రోజుల వ్యవధిలోనే వేలలో కాదు, ఏకంగా లక్షల సంఖ్యలో ఫాలోవర్లను కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో ఫాలోవర్లు ఎందుకు మిస్ అయ్యారు? దీని వెనుక సాంకేతిక లోపం ఉందా? లేక మరేదైనా కారణం ఉందా? అంటూ ఆయన మస్క్‌ను ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘ సినీ చరిత్ర కలిగి, దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించి, ఇటీవలే ‘కార్తికేయ 2’, ‘టైగర్ నాగేశ్వర రావు’ వంటి తెలుగు సినిమాలతో టాలీవుడ్​ ప్రేక్షకులకు దగ్గరైన ఆ ప్రముఖ నటుడు మరెవరో కాదు… ఆయనే అనుపమ్ ఖేర్.

Anupam Kher Twitter

Anupam Kher Twitter

అసలేం జరిగింది..

సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్ ఖాతాలో జరిగిన ఈ అసాధారణ లోపాన్ని గమనించి, తక్షణమే X చీఫ్ ఎలన్ మస్క్‌కు ఈ విధంగా ట్వీట్ చేశారు. “ప్రియమైన మిస్టర్ ఎలన్ మస్క్! గత 15 రోజుల్లో నేను 9,00,000 (తొమ్మిది లక్షలకు పైగా) ఫాలోవర్లను కోల్పోయాను. దీనికి గల కారణం ఏమిటో మీకు లేదా మీ టీమ్‌లోని ఎవరికైనా తెలుసా? ఏదేమైనా, ఇది ప్రస్తుతానికి కేవలం ఒక గమనిక మాత్రమే, ఇంకా పూర్తిస్థాయి ఫిర్యాదు కాదు!” అని రాసుకొచ్చారు.

అనుపమ్ ఖేర్ చేసిన ఈ ట్వీట్‌లో “ఇది ఫిర్యాదు కాదు, కేవలం గమనిక మాత్రమే” అని పేర్కొన్నప్పటికీ, తొమ్మిది లక్షలకు పైగా ఫాలోవర్లు మాయం కావడం అనేది ఒక ప్రముఖ సెలబ్రిటీకి సంబంధించినంత వరకు అతిపెద్ద సాంకేతిక సమస్యగానే పరిగణించవచ్చు. మరి ఈ విషయంలో ఎలన్ మస్క్ లేదా X టెక్నికల్ టీమ్ ఏ విధంగా స్పందిస్తుంది, ఫాలోవర్లను కోల్పోవడానికి గల అసలు కారణాన్ని వెల్లడిస్తారా లేదా అనే దానిపైనే ఇప్పుడు సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియా యూజర్లందరిలో ఉత్కంఠ నెలకొంది.