AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఎక్కడికక్కడ ధ్వంసమైన భవనాలు

ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్టు జియోలాజికల్ సర్వే అధికారులుకు స్పష్టం చేశారు. ఒక్కసారి భూమి కంపించడంలో తీవ్ర భయాందోళనకు గురైన జనాలు ఇళ్లు, భవనాల నుంచి బయటకుపరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రతతో పాలు ప్రాంతాల్లో ఇళ్లకు పగుళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. 

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఎక్కడికక్కడ ధ్వంసమైన భవనాలు
Indonesia Earthquake
Anand T
|

Updated on: Apr 02, 2026 | 6:28 AM

Share

ఇండినేషియాలో భారీ భూకంపం సంభవించింది. దేశంలోని ఉత్తర మొలుక్కా సముద్ర ప్రాంతంలో 7.8 తీవ్రతతో భూమి ఒక్కసారిగా కంపించడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, భయవనాలు వది ప్రాణభయంలో పరుగులు పెట్టారు.ఈ భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో భవనాలకు పగుళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన   యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ అధికారులు10 అడుగుల లోతులో భూకంపం సంభవించినట్లు తెలిపారు.

భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని యూఎస్  పర్యవేక్షణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. అలాగే త్వరలోనే ఇండోనేషియా, ఫిలిపిన్స్, మలేషియా దేశాలకు సునామీ రాచ్చని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆయా దేశాలను అలర్ట్ చేసింది. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.

వీడియో చూడండి..

Follow Us