Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ఫిట్‌నెస్, బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?
నలభై ఏళ్ల వయసులోనూ ఫ్లావ్‌లెస్ స్కిన్, టోన్డ్ ఫిగర్, సిల్కీ హెయిర్, అదిరిపోయే ఫిట్నెస్తో ఆకట్టుకుంటున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవర ప్రసాద్’ సినిమాతో బిజీగా ఉన్న నయన్ తాజాగా ఓ బ్యూటీ బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా తన ..

నలభై ఏళ్ల వయసులోనూ ఫ్లావ్‌లెస్ స్కిన్, టోన్డ్ ఫిగర్, సిల్కీ హెయిర్, అదిరిపోయే ఫిట్నెస్తో ఆకట్టుకుంటున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవర ప్రసాద్’ సినిమాతో బిజీగా ఉన్న నయన్ తాజాగా ఓ బ్యూటీ బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా తన డైట్, బ్యూటీ సీక్రెట్స్‌ని పంచుకుంది.
అందరూ అనుకునేట్టు నయన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఖరీదైన జిమ్ వర్కౌట్‌లు, ఫ్యాన్సీ కాస్మెటిక్స్ కాదు.. సింపుల్‌గా ఉండే మన సౌత్ ఇండియన్ డైట్! ‘మన ప్రాంతానికి, సీజన్‌కు అనుగుణంగా ఉండే సాంప్రదాయ సౌత్ ఇండియన్ ఆహారం తింటే చాలు’ అంటోంది నయన్. ఎటువంటి ఖరీదైన ఇంటర్నేషనల్ డైట్ ప్లాన్స్, కాస్మెటిక్ ట్రీట్‌మెంట్స్ లేకుండా, సరళమైన దక్షిణ భారతీయ జీవనశైలితోనే ఆరోగ్యంగా ఉన్నానంటోంది.
డైట్ ప్లాన్..
నయనతార రోజువారీ భోజనం పూర్తిగా సౌత్ ఇండియన్ స్టేపుల్స్‌పై ఆధారపడి ఉంటుందట. ఉదయాన్నే ఖాళీ కడుపున వెజిటబుల్ జ్యూస్ లేదా మజ్జిగ తాగుతుందట. ఇది డైజెస్టివ్ ఎంజైమ్స్ యాక్టివేట్ చేసి మెటబాలిక్ రేట్ పెంచుతుంది. మధ్యాహ్నం భోజనంలో పప్పు, సాంబార్, రసం, అన్నం, పెరుగు అన్నం తప్పకుండా ఉండేలా చూసుకుంటుందట. వీటిలో ప్రొటీన్, ఫైబర్, ప్రొబయోటిక్స్ సమతుల్యంగా ఉంటాయి.
రాత్రి భోజనానికి రాగి జావ, సిరిధాన్యాల రొట్టె లేదా లైట్ ఇడ్లీ తింటుందట. వీటిలో కార్బ్స్ తక్కువ, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి ఇన్సులిన్ స్పైక్స్ నియంత్రణలో ఉంటాయి. వీటితో పాటు మరికొన్ని స్పెషల్ ఇంగ్రీడియెంట్స్ కొబ్బరి, కరివేపాకు, నువ్వుల నూనె, సీజనల్ పండ్లు మామిడి, అరటి వంటి వాటిని తప్పకుండా తీసుకుంటుందట. వీటిలో యాంటీ-ఆక్సిడెంట్స్, విటమిన్ E, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి.
బ్యూటీ సీక్రెట్స్
నయనతార బ్యూటీ రొటీన్ కూడా సరళంగా, సౌత్ ఇండియన్ స్టైల్‌లోనే సాగుతుంది. రోజుకు 3–4 లీటర్ల నీళ్లు తాగడం ద్వారా శరీరాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేస్తుంది. వారానికి ఒకసారి కరివేపాకు-నువ్వుల నూనె మిశ్రమంతో స్కాల్ప్ నుంచి ముఖం వరకు మసాజ్ చేసుకుంటుంది. రాత్రి పెరుగును మాస్క్‌లా పెట్టుకుంటుంది. షాంపూకి బదులు రేఠా-శికాకాయ పౌడర్, సన్ ప్రొటెక్షన్‌కి నువ్వుల నూనె – ఇవన్నీ కెమికల్ ఫ్రీ, యాంటీ-ఏజింగ్ గుణాలతో నిండిన సహజ పద్ధతులు.
ఈ రొటీన్ చర్మాన్ని గ్లోయింగ్‌గా, జుట్టును దృఢంగా, షైనీగా ఉంచుతాయి. నయన్ బ్యూటీ సీక్రెట్ చాలా సింపుల్. స్థానిక, సీజనల్, సాంప్రదాయ ఆహారం, సహజ స్కిన్ & హెయిర్ కేర్, స్థిరమైన హైడ్రేషన్. ఈ మూడు అలవాట్లు శరీరాన్ని లోపలి నుంచి పోషించి, బయటి అందాన్ని స్వాభావికంగా నిలబెడతాయి. ఏ వయసులోనైనా యవ్వనంగా కనిపించాలంటే ఖరీదైన ట్రీట్‌మెంట్స్ అవసరం లేదు మనకు అలవాటైన తిండి తింటే చాలు అంటోంది నయన్. మరెందుకు ఆలస్యం మీరూ ట్రై చేసి ఫిట్‌గా మెరిసిపోండి!




