ఎముకల దృఢత్వం నుంచి హార్మోన్ బ్యాలెన్స్ వరకు.. మహిళలకు ప్రొటీన్ ఎంత అవసరమో తెలుసా!
మహిళల్లో 30 ఏళ్లు దాటగానే శరీరం ఒక్కసారిగా సీక్రెట్ మోడ్ లోకి వెళ్తుంది. బయట నుంచి చూస్తే అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం చిన్న చిన్న అలారాలు మొదలవుతాయి. ఒక్కసారిగా జుట్టు రాలడం, మోకాళ్లలో నొప్పి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ..

మహిళల్లో 30 ఏళ్లు దాటగానే శరీరం ఒక్కసారిగా సీక్రెట్ మోడ్ లోకి వెళ్తుంది. బయట నుంచి చూస్తే అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం చిన్న చిన్న అలారాలు మొదలవుతాయి. ఒక్కసారిగా జుట్టు రాలడం, మోకాళ్లలో నొప్పి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవడం, రాత్రి పూట హాట్ ఫ్లాషెస్, ఒక్కసారిగా బెల్ట్ టైట్ అనిపించడం, మూడ్ ఒక్కసారిగా డౌన్ అవడం… ఇవన్నీ సాధారణం అనుకుంటాం కానీ ఇవి మన శరీరం పంపే ముందస్తు హెచ్చరికలు.
30–45 మధ్య వచ్చే ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే 50 దాటాక భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఈ అన్ని సమస్యలకూ ముందు నుంచే సరైన జాగ్రత్తలు తీసుకుంటే 50 ఏళ్ల వయసులోనూ 30లా మెరిసిపోవచ్చు! ముప్పై ఏళ్లు దాటిన మహిళల్లో వచ్చే 90 శాతం సమస్యలకు కారణం ప్రొటీన్ కొరతనే అని పలు అధ్యనాల్లో తెలింది. మహిళల ఆరోగ్యంలో ముఖ్యమైన ఆయుధమైన ప్రొటీన్ కొరత వల్ల కలిగే సమస్యలేంటో అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం...

Protein Women
- మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ తగ్గడంతో ఎముకల్లో కాల్షియం త్వరగా కరిగిపోతుంది. కానీ ప్రొటీన్ లేకపోతే కాల్షియం ఎముకల్లో అంటుకోదు! హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధన ప్రకారం… రోజుకు ప్రతి కిలో శరీర బరువుకు 1.2–1.6 గ్రాముల ప్రొటీన్ తీసుకుంటే ఎముకల డెన్సిటీ 5–8% పెరుగుతుంది. అంటే 50 ఏళ్ల వయసులోనూ మెట్లు ఎక్కడం, బరువులు ఎత్తడం సులువుగా ఉంటుంది.
- ప్రొటీన్‌లోని టైరోసిన్, ట్రిప్టోఫాన్ వంటి అమైనో యాసిడ్స్ సెరటోనిన్, డోపమైన్ ఉత్పత్తికి అవసరం. పీరియడ్స్ ముందు లేదా PCOS ఉన్న మహిళల్లో ఇన్సులిన్ రెజిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్ రిచ్ భోజనం ఇన్సులిన్ స్పైక్‌ను 40% వరకు తగ్గిస్తుంది
- ప్రొటీన్ తిన్నప్పుడు శరీరం 20–30% కేలరీలను జీర్ణం చేయడానికే ఖర్చు చేస్తుంది. అందుకే ప్రొటీన్ ఎక్కువ తీసుకుంటే ఆకలి తగ్గుతుంది, బెల్లీ ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది, మెటబాలిజం పెరుగుతుంది.
- 50–60 కేజీల బరువు ఉండే మహిళలకు శరీరానికి తగినంత ప్రొటీన్ అందాలంటే వారి రోజూవారి ఆహారంలో కొన్ని పదార్థాలను తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.
- ఉదయం 2 ఉడికించిన కోడి గుడ్లు, ఒక గ్లాసు పాలు, మధ్యాహ్నం 100 గ్రాముల పనీర్ లేదా చికెన్, రాత్రి భోజనానికి 100 గ్రాముల చేప లేదా కాల్చిన చికెన్ తీసుకోవాలి. వెజిటేరియన్ అయితే పనీర్, సోయా చంక్స్, రాగి జావ, రాజ్మా, చనా… వంటివాటిని ఎంచుకోవచ్చు.
ప్రొటీన్ అంటే కేవలం కండరపుష్టి కోసమే కాదు, అది ఎముకలను కూడా బలోపేతం చేస్తుంది, మూడ్‌ను స్టెబుల్‌గా ఉంచుతుంది, హార్మోన్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది, శరీరాన్ని 40–50 ఏళ్లలోనూ శక్తివంతంగా మారుస్తుంది.




