సీజన్‌తో పనిలేకుండా ఏడాది పొడవునా అరటిపండ్లు అన్ని కాలాల్లో, అన్ని చోట్ల లభిస్తాయి. ఇందులో కార్బోహైడ్రేట్ల అధికంగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి
TV9 Telugu
ఇందులో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, రిబోఫ్లేవిన్, ఫొలేట్, కాపర్, పీచు, బి6, సి-విటమిన్లు వంటి పోషకాలు దండిగా ఉంటాయి. అరటిపండ్లు శక్తిని అందించడమే కాకుండా మంచి జీర్ణక్రియను నిర్వహించడానికి కూడా సహాయపడతాయి
TV9 Telugu
ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. గుండె ఆరోగ్యానికి మంచివి. తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచుతుంది
TV9 Telugu
అరటిపండు మూత్రపిండాల్లో సమస్యలను నివారిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకుంటే నీరసం తగ్గి, తక్షణ శక్తి వస్తుంది
TV9 Telugu
ఇంత మేలు చేసే అరటిపండు ఏ సమయంలోనైనా తినొచ్చని అందరూ అనుకుంటారు. కానీ ఆరోగ్యానికి ఇది మంచిది కాదు. అరటిపండ్లు తినడానికి సరైన సమయం అంటూ ఒకటి ఉంది
TV9 Telugu
భోజనం చేసిన వెంటనే లేదా రాత్రి ఆలస్యంగా అరటిపండు తినడం వల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుంది. దీనివల్ల ఉబ్బరం, గ్యాస్ వస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ కడుపు ఇప్పటికే ఆహారాన్ని జీర్ణం చేయడంలో బిజీగా ఉంటుంది
TV9 Telugu
ఫలితంగా పేగు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. బదులుగా అరటిపండ్లు ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య తినడం మంచిది. తద్వారా అవి త్వరగా జీర్ణమవుతాయి. తక్షణ శక్తిని అందిస్తాయి
TV9 Telugu
వ్యాయామం చేయడానికి ముందు కూడా అరటిపండ్లు తినవచ్చు. అరటిపండ్లతో పాలు, పెరుగు వంటి ఆహారాలు తీసుకోకూడదు. అలాగే భారీ భోజనం తర్వాత కూడా వీటిని తినకూడదు. ఇది జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది