చాలా మందికి రాత్రి భోజనంలో చపాతీని భాగం చేసుకోవడం అలవాటుగా మారింది. ఇది మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది
TV9 Telugu
ఒక్క రాత్రి పూట అనే కాదు.. రోజులో ఒకసారి చపాతీ తిన్నా కూడా సమాన ఫలితం ఉంటుందట. ఇందులో ‘బి’, ‘ఇ’ విటమిన్లతో పాటు కాపర్, జింక్, అయొడిన్, మాంగనీస్, సిలికాన్, పొటాషియం, క్యాల్షియం.. వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి
TV9 Telugu
చపాతీలో గ్లూటెన్ అధికంగా ఉంటుంది. బీన్స్, క్యారట్ ముక్కలు, పాలకూర.. వంటి వాటిని ఉడికించి.. గోధుమ పిండి కలిపేటప్పుడు అందులో వేసి చపాతీ చేసుకుంటే అటు రుచికి రుచి.. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం
TV9 Telugu
అయితే బరువు తగ్గాలనుకునే వారు చాలా మంది గ్లూటెన్-ఫ్రీ డైట్‌తో సహా వివిధ ఆహారాలను అనుసరిస్తున్నారు. అంటే గ్లూటెన్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉంటున్నారన్నమాట
TV9 Telugu
అయితే అందరూ గ్లూటెన్ రహిత ఆహారం తీసుకోవడం సరైనది కాదని నిపుణులు అంటున్నారు. గ్లూటెన్ శరీరానికి మేలు చేసే సహజ ప్రోటీన్ అని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
ఆరోగ్యకరమైన వ్యక్తులలో ఇది ఫైబర్, శక్తికి అందించే సహజ ప్రోటీన్. అయితే గ్లూటెన్ అసహనం, సెలియాక్ వ్యాధి, గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి మాత్రమే గ్లూటెన్ రహిత ఆహారం ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
గ్లూటెన్ రహిత ఆహారం కొందరికి హానికరం కావచ్చు. కొంతమంది గోధుమ రొట్టె తినడం మానేస్తారు, కానీ వారు అది అందించే ఫైబర్, విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, ఐరన్, జింక్‌లను కూడా కోల్పోతారు
TV9 Telugu
వీటి లోపం బలహీనత, మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్యవంతులైన సాధారణ వ్యక్తులు గోధుమ, ఓట్ మీల్, బ్రెడ్ వంటి గ్లూటెన్ కలిగిన ఆహారాలను తినవచ్చు