Watch Video: ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కారును ఆపిన తెలంగాణ పోలీసులు.. ఎందుకంటే..
తెలంగాణలో పల్లె పోరు జోరు మీదుంది.. మూడో విడత సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామాల్లో నేటితో నామినేషన్ గడువు ముగుస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఖమ్మం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కారును పోలీసులు తనిఖీ చేశారు.

తెలంగాణలో పల్లె పోరు జోరు మీదుంది.. మూడో విడత సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామాల్లో నేటితో నామినేషన్ గడువు ముగుస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఖమ్మం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కారును పోలీసులు తనిఖీ చేశారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెం సమీపంలో చెక్ పోస్ట్ దగ్గర వాహనాన్ని ఆపి చెక్ చేశారు. అయితే.. నారా భువనేశ్వరి హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళిలో భాగంగా పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి పోలీసులతో ఆప్యాయంగా మాట్లాడారు. తనిఖీ అనంతరం పోలీసులు కారును పంపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వీడియో చూడండి..
తెలంగాణలో ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..
తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓ ఘట్టం ముగిసింది. 3వ తేదీతో నామినేషన్ల విత్ డ్రా ఎపిసోడ్ పూర్తవడంతో బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కీలక విషయాలు వెల్లడించింది. తొలి విడతలో 4,236 గ్రామాలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 22,330 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపింది. ప్రధాన పార్టీల బుజ్జగింపుల తర్వాత మొదటి విడతలో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 39 గ్రామాల్లో.. 33 గ్రామాల ఏకగ్రీవంతో ఆదిలాబాద్ జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. అత్యల్పంగా కరీంనగర్ జిల్లాలో మూడు గ్రామాలు, హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో నాలుగు గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఐదు గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో వాటిపై ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
