Telangana: తొలి విడతలో 395 గ్రామాల్లో ఏకగ్రీవం.. అత్యధికంగా ఏ జిల్లాలో అయ్యాయంటే?
మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సర్పంచ్ స్థానం కోసం వేల సంఖ్యలో నామినేషన్ దాఖలు కాగా.. విత్ డ్రా కోసం అవకాశం ఉన్న చివరి రోజు వేల సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. బుజ్జగింపుల తర్వాత కొన్ని గ్రామాలు ఏకగ్రీవం వైపు కూడా నడిచాయి.

మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో తేదీ నామినేషన్ల విత్ డ్రా పూర్తయిన తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల ను ప్రకటించారు ఎన్నికల అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 4,236 గ్రామాలకు మొదటి విడతలో నోటిఫికేషన్ ఇవ్వగా 22, 330 మంది నామినేషన్‌లో దాఖలు చేశారు. బుజ్జగింపుల తర్వాత మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 395 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 39 గ్రామాల్లో ఏకగ్రీవం కాగా 33 గ్రామాల్లో ఏకగ్రీవమైన ఆదిలాబాద్ జిల్లా రెండవ స్థానం లో ఉంది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా అత్యల్పంగా కరీంనగర్ జిల్లాలో మూడుగ్రామాలు, హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో నాలుగు గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఐదు గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికల పై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ప్రక్రియ మొత్తం పూర్తి అవడం తో మొదటి విడతలో 3,836 గ్రామపంచాయతీలకు ఎన్నిక జరగనుంది.
3,836 గ్రామ పంచాయతీ ల సర్పంచ్ పదవికోసం 13,127 మంది అభ్యర్థులు ఎన్నికకు బరిలో నిలిచారు. 37,440 వార్డులకు ఎన్నిక జరగనుండగ. 27,960 వార్డులకు ఎన్నిక జరగనుంది. 9,331 వార్డులకు ఏకగ్రీవం అయినట్టు అధికారులు ప్రకటించారు. దాదాపు 22,000 మంది సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేయగా.. 8,095 మంది అభ్యర్థులు తమ నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 4,236 గ్రామాలకు మొదటి విడతలో నోటిఫికేషన్ ఇవ్వగా. 395 గ్రామాలకు ఏకగ్రీవం కాగా3836 గ్రామాలకు మొదటి విడుదల భాగంగా 11వ తేదీ ఎన్నిక జరగనుంది. పనులని పూర్తి కావడంతో వారం రోజులపాటు ప్రచార పోరు జిల్లాలో పెరగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
