AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాక్టింగ్, మెగా ఫోన్.. ఈ ఏడాది 4 బ్లాక్‌బస్టర్లతో రెచ్చిపోయిన స్టార్ హీరో! ఎవరో ఊహించగలరా?

నేటి సినిమా ప్రపంచంలో, ఒక స్టార్ హీరో ఒక సినిమాను పూర్తి చేయడానికి కనీసం రెండేళ్ల సమయం తీసుకుంటున్నారు. బడ్జెట్ పెరగడం, షూటింగ్ ప్లానింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయించడం వంటి కారణాల వల్ల ప్రేక్షకులకు ఇష్టమైన హీరోను తెరపై చూడాలంటే ..

యాక్టింగ్, మెగా ఫోన్.. ఈ ఏడాది 4 బ్లాక్‌బస్టర్లతో రెచ్చిపోయిన స్టార్ హీరో! ఎవరో ఊహించగలరా?
Star Hero
Nikhil
|

Updated on: Dec 05, 2025 | 7:46 AM

Share

నేటి సినిమా ప్రపంచంలో, ఒక స్టార్ హీరో ఒక సినిమాను పూర్తి చేయడానికి కనీసం రెండేళ్ల సమయం తీసుకుంటున్నారు. బడ్జెట్ పెరగడం, షూటింగ్ ప్లానింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయించడం వంటి కారణాల వల్ల ప్రేక్షకులకు ఇష్టమైన హీరోను తెరపై చూడాలంటే రెండు నుంచి మూడేళ్లు ఎదురుచూడక తప్పడం లేదు.

అలాంటి ట్రెండ్‌ నడుస్తున్న సమయంలోనూ, ఒకే సంవత్సరంలో ఏకంగా నాలుగు సినిమాలను విడుదల చేసి, అన్నిటినీ విజయపథంలో నడిపించిన ఒక అరుదైన హీరో ఉన్నాడంటే నమ్ముతారా? ఇది కేవలం నటనతో సాధించిన రికార్డు కాదు, దర్శకత్వ ప్రతిభతో కలిపి సాధించిన చారిత్రక ఘనత. ప్రతి ప్రాజెక్టులోనూ వైవిధ్యం చూపించి, ప్రేక్షకులను కొత్తగా అలరించే సత్తా ఉన్న ఆ హీరో ఎవరు?

ఆ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న హీరో మరెవరో కాదు, తమ ప్రత్యేకమైన కథా ఎంపిక, సహజ నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కోలీవుడ్​ స్టార్​ హీరో ధనుష్! ఈ సక్సెస్​ఫుల్​ మల్టీటాలెంటెడ్​ హీరో స్క్రిప్ట్ సెలెక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఒక్క సంవత్సరంలో ఆయన సాధించిన విజయం సినీ పరిశ్రమలోనే ఒక హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన కేవలం నటుడిగానే కాకుండా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు.

Tamil Star Dhanush

Tamil Star Dhanush

ఈ ఏడాది ధనుష్ ఖాతాలో చేరిన హిట్స్​..

ఈ సంవత్సరంలో మొట్టమొదటగా ఫిబ్రవరిలో విడుదలైన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే సినిమాకి ధనుష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత, హీరోగా ధనుష్​ నటించిన భారీ సినిమా ‘కుబేర’ విడుదలైంది. శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో ధనుష్​, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. టాలీవుడ్​ స్టార్​ హీరో నాగార్జున కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించారు.

వీటితో పాటు ధనుష్​ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడ్లీ కడై’, తాజాగా విడుదలైన ‘తేరే ఇష్క్​ మైన్’ వంటి సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. ధనుష్ ఒకే సంవత్సరంలో మూడు సినిమాలలో హీరోగా నటించడంతో పాటు, ఒక సినిమాని డైరెక్ట్ చేసి, మొత్తంగా నాలుగు ప్రాజెక్టులను అందించారు. నాలుగు సినిమాలూ విజయాలను అందుకోవడంతో, ప్రస్తుతం ధనుష్ గారు తిరుగులేని ఫామ్‌లో ఉన్నారని చెప్పవచ్చు. తన నటన, దర్శకత్వం ద్వారా ప్రేక్షకులను అంచలంచెలుగా అలరిస్తూ, తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు.