Akhanda 2: డేట్ మాత్రమే మారింది.. విధ్యంసం కాదు.. అఖండ 2 వాయిదాపై ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 వాయిదా పడిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో ప్రీమియర్ షోలు రద్దు చేసిన మేకర్స్.. కాసేపటికి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. దీంతో ఇప్పుడు ట్విట్టర్ వేదికగా నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ అఖండ 2. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అఖండ 2పై మరింత హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాను డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే ప్రమోషన్స్ సైతం కంప్లీట్ చేశారు. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాసేపటికే ఈ మూవీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. క్యాలెండర్‌లో డేట్ మారింది. కానీ 5న అఖండ-2 ఆట పడటం లేదన్న బ్రేకింగ్ న్యూస్ బాలయ్య ఫాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. అఖండ-2 విడుదల ఆగిపోయింది. అంతరాయానికి చింతిస్తున్నామని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఫ్లస్ మిడ్ నైట్ ప్రకటించింది. అనివార్య కారణాలతో విడుదల వాయిదా వేస్తున్నట్టు ట్వీట్ చేసింది. రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని ట్వీట్‌లో పేర్కొంది.
షెడ్యూల్ ప్రకారం షోలు వేసేందుకు చాలా ప్రయత్నించాం, కానీ కొన్ని మా చేతుల్లో లేకుండా పోయాయి. అసౌకర్యానికి క్షమించండి.. అంటూ ట్వీట్ చేశారు 14 రీల్స్ ప్రతినిధులు. ప్రీమియర్ షో రద్దయినందుకే అభిమానులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.కొన్ని గంటల వ్యవధిలోనే మరో షాకింగ్ ప్రకటన. అనివార్య కారణాల వల్ల అఖండ-2ను విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది 14 రీల్స్ సంస్థ..
కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి రా .. పాపం రా ఇలాంటోళ్ళ అభిమానం ఏం చేసింది రా నీకు 😌 😥 pic.twitter.com/IUnyDBbrnT
— భం అఖండᵀᴴᴬᴺᴰᴬⱽᴬᴹ డాకు(ᴹᵃʰᵃʳᵃᵃʲ) 💥💥 (@legendSashidhar) December 4, 2025
అఖండ -2 విడుదల వాయిదాపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.. అభిమానం ఏం చేసింది మీకు.. మా హీరో కష్టాన్ని నేలపాలు చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. డేట్ మాత్రమే మారింది.. కానీ విధ్యంసం కాదు.. అఖండ 2 సక్సె్స్ సంచలనం అలాగే ఉంది అంటున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.
The date may change, but the destiny won’t. Success has been postponed, not paused. ⚡#Akhanda2 #NBK #Balayya pic.twitter.com/pRfyGqZoOz
— Milagro Movies (@MilagroMovies) December 4, 2025
ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?




