AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TET 2025 Exam Date: డిసెంబరు 10 నుంచి టెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌ 2025) రాత పరీక్షలు డిసెంబరు 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు ఏపీ టెట్‌ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రటకనలో తెలిపారు. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి..

AP TET 2025 Exam Date: డిసెంబరు 10 నుంచి టెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
AP TET 2025 Exam Date
Srilakshmi C
|

Updated on: Dec 05, 2025 | 6:56 AM

Share

అమరావతి, డిసెంబర్‌ 5: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌ 2025) రాత పరీక్షలు డిసెంబరు 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు ఏపీ టెట్‌ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రటకనలో తెలిపారు. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి 12గంటలు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ రోజుకు రెండు విడతలుగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ సారి టెట్‌కు మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారని వెల్లడించారు.

ఏపీ టెట్ 2025 హాల్‌ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (SLPRB) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ లేదా రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. మొత్తం 42 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టుల భర్తీకి ఆగస్టులో నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి అక్టోబర్‌ 10న రాత పరీక్ష నిర్వహించింది. మొత్తం 1520 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులు పేపర్‌ 1 (అబ్జెక్టివ్‌) జవాబు పత్రాల ఓఎంఆర్‌ షీట్లను డిసెంబర్‌ 5 నుంచి 8 వరకు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వీలు కల్పించారు. ఇక పేపర్‌ 2 (డిస్క్రిప్టివ్‌) రీకౌంటింగ్‌ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది. ఇతర వివరాలకు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ పై క్లిక్‌ చేయండి.

ఏపీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే