AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..! మజిలీ చిన్నది ఎంత మారిపోయింది.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే..

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య గతకొంతకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా తర్వాత మరో హిట్ అందుకోలేక పోయాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా చేశాడు.

బాబోయ్..! మజిలీ చిన్నది ఎంత మారిపోయింది.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే..
Majili Movie
Rajeev Rayala
|

Updated on: Dec 04, 2025 | 11:40 PM

Share

అక్కినేని అందగాడు నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటించిన చిత్రం బ్లాక్ బస్టర్ మూవీ ‘మజిలీ’. 2017లో రియల్ కపుల్‌గా మారిన వీరిద్దరూ.. సరిగ్గా రెండేళ్ల తర్వాత 2019లో ఈ చిత్రంలో నటించారు. ఇది బాక్సాఫీస్ దగ్గర క్లాసిక్ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఏడాదికే వీరు ఊహించని విధంగా విడిపోయారు. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ లవ్ స్టోరీకి.. ఆ సమయంలో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. భారీగా వసూళ్లు తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ఈ సినిమాకు మీరా అనే క్యారెక్టర్ కీలకమన్న సంగతి తెలిసిందే. మీరా వచ్చాక శ్రావణి (సమంతా) జీవితం మారిపోతుంది. ఇక మీరా క్యారెక్టర్‌లో నటించిన ఆ చిన్నారి మీకు గుర్తుందా.? ఇప్పుడు ఆ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ కాదండీ.. హీరోయిన్ మెటీరియల్ అయ్యింది. ఆమె మరెవరో కాదు..

ఆమె పేరు అనన్య అగర్వాల్.. 2004లో ముంబైలో పుట్టిన ఈ చిన్నదానికి ఇప్పుడు 20 ఏళ్లు వచ్చాయి. 2008వ సంవత్సరం నుంచి బుల్లితెరపై రాణిస్తోన్న ఈ చిన్నారి.. తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నా అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్?, క్యా హువా తేరా వాద, మహా భారత్, సియా కే రామ్ వంటి సీరియల్లో నటించింది. అలాగే పలు యాడ్స్‌ కూడా చేసింది.

ఇక సిల్వర్ స్క్రీన్‌పై ఆమె నటించిన మొదటి చిత్రం ‘మజిలీ’. ఈ చిత్రంలో చైతూ మాజీ ప్రేయసి కూతురుగా ఆమె కనిపించింది. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. బుల్లితెరపై పలు సీరియల్స్ నటిస్తూనే.. సోషల్ మీడియాలో పలు బ్రాండ్స్‌కి ప్రమోషన్స్ చేస్తోంది ఈ చిన్నది. ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఫోటోలు తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .