AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : వాళ్లు సర్వనాశనం అయిపోతారు.. పుట్టగతులు ఉండవు… హీరోయిన్ ఎమోషనల్..

ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతో దక్షిణాది చిత్రపరిశ్రమను ఊపేశారు. సౌందర్య, మీనా, రంభ, సంఘవి, రోజా వంటి హీరోయిన్లు ఇండస్ట్రీని ఏలేస్తున్న సమయంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Actress : వాళ్లు సర్వనాశనం అయిపోతారు.. పుట్టగతులు ఉండవు... హీరోయిన్ ఎమోషనల్..
Indraja
Rajitha Chanti
|

Updated on: Dec 05, 2025 | 7:40 AM

Share

దక్షిణాది సినీపరిశ్రమలో ఒకప్పుడు అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఇంద్రజ ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న ఇంద్రజ.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ఇటీవలే బుల్లితెర అడియన్స్ ముందుకు వచ్చింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో జడ్జిగా వ్యవహరిస్తుంది. తాజాగా కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్న ఇంద్రజ తన కెరీర్, లైఫ్, పెళ్లికి సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు. సుధీర్ తనను అమ్మలాగే చూసుకుంటారని.. ఆ బంధం దేవుడు ఇచ్చిన బంధమే అన్నారు. అలాగే ప్రేమ, బ్రేకప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‏లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..

ఒకరు మనల్ని మోసం చేశారు అన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందని యాంకర్ వర్ష అడగ్గా.. ఇంద్రజ స్పందిస్తూ.. “నార్మల్ డెలివరీ ఇచ్చేటప్పుడు వచ్చే పెయిన్ హయ్యస్ట్ బాధ అంటారు కదా.. అంతకు సమానంగా ఉండే పెయిన్ ఏదైనా ఉందంటే అది ప్రేమలో మోసపోవడమే. అది చేసినవాళ్లు ఆడదైనా మగవాడైనా సరే వాళ్లకు పుట్టగతులు ఉండవు అంతే.. సర్వనాశనం అయిపోతారు. మీరు పుట్టింది ప్రేమించడానికి కాదు.. సాధించడానికి. టాలెంట్ ఉంటేనే సినీరంగంలో నిలదొక్కుకుంటాం. లక్ ఉంటేనే సక్సెస్ అవుతాం. టాలెంట్ ఉంటేనే అవకాశం వస్తుంది. కానీ ఇక్కడ లక్ ఉంటేనే సక్సెస్ వస్తుంది” అని అన్నారు ఇంద్రజ.

ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..

మీ అమ్మగారి విషయంలో ఏదో అసంతృప్తి ఉందన్నారు అదేంటీ అని వర్ష అడగ్గా.. “అదేం లేదు. అమ్మ తన చివరి రోజుల్లో చాలా సార్లు వడపళని గుడికి తీసుకెళ్లమని అడిగింది. కానీ నేను ప్రతిసారి వాయిదా వేశారు. తర్వాత అమ్మ చనిపోయింది. అమ్మను అక్కడికి తీసుకెళ్లలేకపోయాననే బాధ మాత్రం మిగిలిపోయింది. అది అనుభవించినవాళ్లకే తెలుస్తుంది” అంటూ ఎమోషనల్ అయ్యారు ఇంద్రజ.

ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..