Vande Bharat express: ఏపీ ప్రజలకు రైల్వేశాఖ భారీ శుభవార్త.. వందే భారత్ ట్రైన్ అక్కడ కూడా..
వందే భారత్ సర్వీసులకు డిమాండ్ పెరిగిపోయింది. వేగంగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉండటం, అనేక సదుపాయాలు ఉండటంతో వందే భారత్ ట్రైన్లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తగ్గట్లు రైళ్ల టైమింగ్స్, హాల్ట్‌లలో రైల్వేశాఖ మార్పులు చేస్తోంది. తాజాగా మరో మార్పు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల మీదుగా వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, తిరుపతి ప్రాంతాల నుంచి వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. అయితే తాజాగా రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. కలబురిగి-బెంగళూరు మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు ఇక నుంచి సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్‌లో కూడా ఆగనుంది. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ నుంచి రెండు నిమిషాల పాటు హాల్ట్ ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఇది అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు. అలాగే ఈ రైలు టైమింగ్స్‌లో కూడా మార్పులు చేశారు.
ప్రస్తతుం కలబురగి -బెంగళూరు వందేభారత్ (22231) రైలు ఉదయం 5:15 గంటలకు కలబురగిలో బయలుదేరి.. మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. అయితే ఇక నుంచి ఉదయం 6:10 గంటలకు కలబురగిలో బయలుదేరి బెంగళూరుకు మధ్యాహ్నం 14.10 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో బెంగళూరులో మధ్యాహ్నం 14.40 గంటలకు బయల్దేరి రాత్రి 22.45 గంటలకు కలబురగికి చేరుకుంటుంది. ఇప్పటికే కాచిగూడ నుంచి బెంగళూరు వెళ్లే వందే భారత్ ట్రైన్‌కు హిందూపురంలో హాల్ట్ కల్పించారు. త్వరలోనే దీని షెడ్యూల్ విడుదల కానుంది.
అటు ఇక యశ్వంతపూర్-మచిలీపట్టణం ఎక్స్‌ప్రెస్ (17212) టైమింగ్స్‌లో కూడా కొత్త ఏడాది జనవరి 1 నుంచి మార్పులు చేశారు. ఇప్పటివరకు ఇది బెంగళూరులో మధ్యాహ్నం 1.15 గంటలకు బయల్దేరేది. కానీ ఇక నుంచి 12.45 గంటలకే బయల్దేరుతుంది. గమ్యస్థానానికి మాత్రం ఇంతకముందే టైమ్‌కు చేరుతుంది. ఇక ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ గిద్దలూరు నుంచి డోన్ స్టేషన్ వరకు వెళ్లే సమయాన్న మార్చారు.
