AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: “నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..” ప్రసిద్ధ్ కృష్ణపై కేఎల్ రాహుల్ ఫైర్.. వైరల్ వీడియో చూశారా..!

KL Rahul: కెప్టెన్సీ ఒత్తిడి ఎలా ఉన్నా, బ్యాటర్‌గా రాహుల్ మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు అర్ధశతకాలు సాధించాడు. తొలి మ్యాచ్‌లో 56 బంతుల్లో 60 పరుగులు చేయగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో 43 బంతుల్లోనే అజేయంగా 66 పరుగులు చేశాడు.

Video: నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి.. ప్రసిద్ధ్ కృష్ణపై కేఎల్ రాహుల్ ఫైర్.. వైరల్ వీడియో చూశారా..!
Kl Rahul Priasidh
Venkata Chari
|

Updated on: Dec 05, 2025 | 10:39 AM

Share

సాధారణంగా మైదానంలో ఎంతో ప్రశాంతంగా, కూల్ కెప్టెన్‌గా పేరున్న కేఎల్ రాహుల్ సహనం కోల్పోయాడు. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ స్టేడియంలో బుధవారం (డిసెంబర్ 3) భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా మందలించాడు.

భారత జట్టు 358 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్‌పై ఇది అత్యధిక పరుగుల ఛేదనలో ఒకటిగా నిలిచింది. భారత బౌలర్లకు ఇది కఠినమైన రోజు కాగా, ప్రసిద్ధ్ కృష్ణ ప్రదర్శన మరీ దారుణంగా ఉంది. అతను 8.2 ఓవర్లలోనే 85 పరుగులు సమర్పించుకున్నాడు (ఎకానమీ 10.20), అయినప్పటికీ 2 వికెట్లు దక్కించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ప్రసిద్ధ్ కృష్ణపై కేఎల్ రాహుల్ మండిపాటు..

మ్యాచ్ మధ్యలో రాహుల్ తన సహనాన్ని కోల్పోయిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో రాహుల్, ప్రసిద్ధ్‌తో మాట్లాడుతూ.. సొంత నిర్ణయాలు తీసుకోకుండా, తాను చెప్పినట్లు మాత్రమే బౌలింగ్ చేయాలని ఘాటుగా హెచ్చరించాడు.

వీరిద్దరూ కర్ణాటకకు చెందిన వారు కావడంతో, ఈ సంభాషణ వారి మాతృభాష అయిన కన్నడలో జరిగింది. దేశవాళీ క్రికెట్‌లో వీరిద్దరూ కర్ణాటక జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తారన్న విషయం తెలిసిందే.

స్టంప్ మైక్‌లో రికార్డైన సంభాషణ ప్రకారం రాహుల్ ఇలా అన్నాడు: “ప్రసిద్ధ్, నీ బుర్ర వాడకు.. నేను చెప్పింది చేయి (బౌలింగ్ చెయ్). నేను ఏం వేయమని చెప్పానో అదే బౌలింగ్ చేయి, ఇప్పుడు బౌన్సర్లు వేయొద్దు.”

అయితే, బౌన్సర్ వేయాలా అని ప్రసిద్ధ్ తిరిగి అడగడంతో కెప్టెన్ రాహుల్‌కు మరింత చిరాకు వచ్చింది.

“ప్రసిద్ధ్, నేను ఇప్పుడే నీకు చెప్పి వచ్చాను కదా! అయినా మళ్లీ తలకే బౌలింగ్ చేస్తున్నావ్ ఏంటి రా?” అని రాహుల్ అసహనం వ్యక్తం చేశాడు.

రాహుల్ ఎందుకు కెప్టెన్సీ చేస్తున్నాడు?

రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ ఈ సిరీస్‌కు దూరంగా ఉండటంతో కేఎల్ రాహుల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. రాంచీలో జరిగిన ఉత్కంఠభరితమైన తొలి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ 7.1 ఓవర్లు వేసి 48 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

కెప్టెన్సీ ఒత్తిడి ఎలా ఉన్నా, బ్యాటర్‌గా రాహుల్ మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు అర్ధశతకాలు సాధించాడు. తొలి మ్యాచ్‌లో 56 బంతుల్లో 60 పరుగులు చేయగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో 43 బంతుల్లోనే అజేయంగా 66 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..