AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ముషీర్‌ ఖాన్‌ వర్సెస్‌ పృథ్వీ షా..! మైదానంలో పెద్ద గొడవ.. ఏం జరిగిందంటే?

రంజీ ట్రోఫీకి ముందు మహారాష్ట్ర తరఫున పృథ్వీ షా అద్భుత శతకం సాధించాడు. తన మాజీ జట్టు ముంబైతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన తర్వాత ముంబై ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. షా ముంబై నుండి మహారాష్ట్రకు మారిన తర్వాత తొలిసారి ముంబైతో తలపడడం గమనార్హం.

Video: ముషీర్‌ ఖాన్‌ వర్సెస్‌ పృథ్వీ షా..! మైదానంలో పెద్ద గొడవ.. ఏం జరిగిందంటే?
Prithvi Shaw Vs Musheer Kha
SN Pasha
| Edited By: TV9 Telugu|

Updated on: Oct 08, 2025 | 12:29 PM

Share

రాబోయే రంజీ ట్రోఫీ సీజన్‌కు ముందు జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో మహారాష్ట్ర తరఫున అద్భుతమైన సెంచరీ చేసిన తర్వాత పృథ్వీ షా ముంబై ఆటగాళ్లతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన తర్వాత తన మాజీ జట్టు ముంబైతో తొలిసారి ఆడుతున్న పృథ్వీ షా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ముంబై నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందిన తర్వాత షా మహారాష్ట్ర జట్టుకు మారిన విషయం తెలిసిందే.

అయితే షా అవుట్ అయిన తర్వాత పెవిలియన్‌కు వెళ్తున్నప్పుడు ఈ వాగ్వాదం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ముంబై ఆటగాడు ముషీర్ ఖాన్‌, పృథ్వీ షాకు మధ్య గొడవ అయినట్లు తెలుస్తోంది. అంపైర్లు జోక్యం చేసుకునే ముందు షా తన బ్యాట్‌ చూపిస్తూ బెదిరించాడు. అంపైర్లు, ఇతర ఆటగాళ్లు మధ్యలో జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌కు ముందు పూణేలోని MCA స్టేడియంలో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో బుచ్చి బాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో షా తన అద్భుతమైన ఫామ్‌తో అదరగొట్టాడు. షార్దుల్ ఠాకూర్ నేతృత్వంలోని ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తొలి రోజున పృథ్వీ షా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అర్షిన్ కులకర్ణితో కలిసి మహారాష్ట్ర తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించిన షా 140 బంతుల్లో సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో కులకర్ణి కూడా సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొదటి వికెట్‌కు 305 పరుగులు జోడించారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి