AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: దేశ ప్రజలకు ఆర్బీఐ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈఎంఐలు కట్టేవారికి పండుగే.. పండుగ

ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును మరోసారి తగ్గించింది. తాజాగా జరిగిన సమావేశంలో రెపో రేటును 5.25 శాతానికి తగ్గించింది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఈఎంఐ కట్టేవారికి వడ్డీ తగ్గనుంది.

RBI: దేశ ప్రజలకు ఆర్బీఐ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈఎంఐలు కట్టేవారికి పండుగే.. పండుగ
Rbi
Venkatrao Lella
|

Updated on: Dec 05, 2025 | 10:50 AM

Share

RBI Repo Rate: దేశ ప్రజలకు ఆర్బీఐ గుడ్‌న్యూస్ తెలిపింది. అందరూ ఊహించినట్లుగానే రెపో రేటును మరోసారి తగ్గించింది. ఇప్పటివరకు 5.5 శాతంగా ఉండగా.. శుక్రవారం దానిని 5.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంటే 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.  ఇక స్టాడింగ్ డిపాజిట్ ఫెలిసిటీని రేటును 5 శాతానికి పరిమితం చేయగా.. మార్జినల్ స్టాడింగ్ ఫెలిసిటీ రేటును 5.5 శాతంగా కొనసాగించింది. ఈ సంవత్సరంలో రెపో రేటును తగ్గించడం ఇది నాలుగోసారి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 125 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీని వల్ల ఈఎంఐ చెల్లించేవారికి మరింతగా తగ్గనుంది.

డిసెంబర్ 3 నుంచి ప్రారంభమైన ఆర్‌బీఐ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ మీటింగ్‌లో చర్చించిన అనంతరం రెపో రేటు తగ్గింపును ప్రకటించారు. రెపో రేటు తగ్గింపు తక్షణమే అమల్లో రానుందని ఆర్బీఐ వెల్లడించింది. ద్రవ్యోల్బణం తగ్గడం, జీడీపీ వృద్ధి కొనసాగుతున్న క్రమంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక కార్యకలాపాలు మరింత మెరుగుపడటానికి ఆర్బీఐ తాజా డెసిషన్ ఉపయోగపడనుంది. రెపో రేటు తగ్గింపు వెనక కారణాన్ని ఆర్బీఐ తెలిపింది. ద్రవ్యోల్బణం అంచనా బాగా మెరుగుపడిందని, మునుపటి అంచనాల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని గుర్తించామని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.

వచ్చే ఏడాది ప్రారంభంలో ద్రవ్యోల్బణం 4 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంటాయని సంజయ్ మల్హోత్రా తెలిపారు . విలువైన లోహాల ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణంలో కొంత భాగం పెరుగుతోందని అంచనా వేశారు. ద్రవ్యోల్బణం అనేక సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయిందని, ఆర్థిక వృద్ధి ఆశ్చర్యకరంగా పెరగడంతో ఈ నిర్ణయం నిర్ణయం తీసుకున్నామన్నారు. ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంలో ఉంచుతూ రుణ పరిస్థితులు మద్దతుగా ఉండేలా చూసుకోవడం తమ లక్ష్యమన్నారు.

ఈఎంఐలు కట్టేవారికి లాభం

రెపో రేటు ప్రభావం బ్యాంకుల నుంచి తీసుకునే లోన్లపై ప్రభావితం చూపుతుంది. రెపో రేటు తగ్గింపు వల్ల ఈఎంఐలపై చెల్లించే వడ్డీ అనేది తగ్గుతుంది. దీని వల్ల మీరు చెల్లించాల్సిన ఈఎంఐ తగ్గుతుంది.  ఇక రెపో రేటును తగ్గించినప్పుడు బ్యాంకులు కూడా వివిధ రుణాలపై వడ్డీ రేటును తగ్గించాల్సి ఉంటుది. దీని వల్ల కొత్తగా లోన్ తీసుకునేవారికి కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఏ విధంగా చూసుకున్న ఇది ప్రజలకు శుభవార్తగా చెప్పవచ్చు.

రేపట్నుంచే TSLPRB APP రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు.. లింక్ ఇదే
రేపట్నుంచే TSLPRB APP రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు.. లింక్ ఇదే
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
"నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..": కేఎల్ రాహుల్ ఫైర్
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..