Viral Video : సచిన్ కుటుంబంలో వదినా మరదల్ల సందడి మామూలుగా లేదు.. కుక్కలతో ఆడుకుంటున్న వీడియో వైరల్
సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ , కాబోయే కోడలు సానియా చందోక్ మధ్య మంచి బంధం ఉంది. సచిన్ కూతురు, కోడలు మధ్య ఉన్న ప్రేమ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. సారా టెండూల్కర్, సానియా చందోక్ కలిసి కుక్కలతో ఆడుతూ కనిపించారు.

Viral Video : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో అతి త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఇటీవల సానియా చందోక్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్, కాబోయే కోడలు సానియా చందోక్ మధ్య చాలా మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను, అల్లరిని తెలియజేసే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్కలతో సరదాగా ఆడుకుంటున్న ఈ వీడియోను సారా టెండూల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.
సారా, సానియా మధ్య బలమైన అనుబంధానికి ప్రధాన కారణం వారిద్దరికీ జంతువుల పట్ల ఉన్న ప్రేమ అని చెప్పవచ్చు. వైరల్ అవుతున్న వీడియోలో వీరిద్దరూ కుక్కలకు ప్రేమను పంచుతూ ఆనందంగా గడుపుతున్నారు. సచిన్ టెండూల్కర్ కాబోయే కోడలు అయిన సానియా చందోక్, మిస్టర్ పాస్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ కుక్కలకు వైద్యం చేయడంతో పాటు, వాటిని చూసుకునే పనిని కూడా చేస్తుంది. అదేవిధంగా, సారా టెండూల్కర్‌కు కూడా జంతువులంటే చాలా ఇష్టం. ఈ ఇష్టం వీరిద్దరినీ మరింత దగ్గర చేసింది.
సచిన్ టెండూల్కర్ కుమారుడు, క్రికెటర్ అయిన అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ ఎంగేజ్మెంట్ ఇటీవల జరిగింది. ఆగస్టు 13 రాత్రి ఈ సంతోషకరమైన వార్త బయటకు వచ్చింది. టెండూల్కర్ కుటుంబం ఈ నిశ్చితార్థ వేడుకను చాలా గోప్యంగా నిర్వహించింది. అయితే, నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజుల తర్వాత సచిన్ టెండూల్కర్ స్వయంగా ఈ శుభవార్తను కన్ఫాం చేశారు.
అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి, సచిన్ టెండూల్కర్ కాబోయే కోడలు సానియా, ఆ కుటుంబంలోని ప్రతి వేడుకలోనూ పాల్గొంటున్నారు. సారా టెండూల్కర్ ప్రారంభించిన పిలేట్స్ అకాడమీ ప్రారంభోత్సవానికి కూడా సానియా హాజరయ్యారు. అంతేకాకుండా, సానియా టెండూల్కర్ కుటుంబంతో కలిసి మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌కు ట్రిప్‌కు కూడా వెళ్లారు. ఇటీవల సచిన్ టెండూల్కర్ తల్లి పుట్టినరోజు సందర్భంగా కూడా సానియా చందోక్ పెళ్లికి ముందే అత్తవారి ఇంటికి వచ్చి వేడుకలో పాలుపంచుకున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




