AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Plans: ఎల్‌ఐసీ నుంచి దిమ్మతిరిగే రెండు కొత్త ప్లాన్స్.. ఈ పాలసీలు తీసుకుంటే మీ పంట పండినట్లే. .

ఎల్ఐసీ మరో రెండు అదిరిపోయే కొత్త ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ప్రొటెక్షన్ ప్లస్, బీమా కవచ్ పేరుతో ప్లాన్స్‌ను ప్రారంభించింది. ఒకటి సేవింగ్స్ ప్లాన్ కాగా.. మరొకటి బీమా ప్లాన్. ఈ రెండు పాన్ల వివరాలు ఏంటి? ప్రీమియం ఎలా ఉంది? అనే వివరాలు చూద్దాం.

LIC Plans: ఎల్‌ఐసీ నుంచి దిమ్మతిరిగే రెండు కొత్త ప్లాన్స్.. ఈ పాలసీలు తీసుకుంటే మీ పంట పండినట్లే. .
పాలసీ వ్యవధి.. ఈ పథకంలో చేరడానికి కనీస ప్రవేశ వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు. పాలసీ కాలపరిమితి 10, 15, 20, 25 సంవత్సరాల నుండి ఎంచుకోవచ్చు, ప్రీమియం చెల్లింపు వ్యవధి (PPT) కూడా తదనుగుణంగా మారుతుంది. గరిష్ట ప్రీమియం పరిమితి లేదు, కానీ ఇది LIC అండర్ రైటింగ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.
Venkatrao Lella
|

Updated on: Dec 05, 2025 | 10:59 AM

Share

LIC Protection Plus plan: కేంద్ర ప్రభుత్వ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పటినుంచో దేశ ప్రజల నోళ్లల్లో నానుతున్న ఈ సంస్థ.. ఎన్నో సేవింగ్స్ ప్లాన్‌ను తీసుకొస్తోంది. ప్రైవేట్ బీమా సంస్థలకు పోటీగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి.. ప్రజల్లో నమ్మకం ఎక్కువగా ఉండటం వల్ల ఎల్‌ఐసీలో పాలసీలు తీసుకునేవారు కోట్లల్లో ఉంటారు. మనం వివిధ పాలసీల ద్వారా ఇన్వెస్ట్ చేసే డబ్బులకు భద్రత ఉండటం, అధిక రాబడి కూడా వస్తుండటంతో ఎల్‌ఐసీలో పాలసీలు తీసుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఎల్‌ఐసీ మరో రెండు ప్లాన్స్‌ను లాంచ్ చేసింది.

ప్రొటెక్షన్ ప్లస్, బీమా కవచ్ పేరుతో ఎల్‌ఐసీ తాజాగా మరో రెండు ఇన్స్యూరెన్స్ ప్లాన్స్‌ను ప్రారంభిచింది. ప్రొటెక్షన్ ప్లాస్ అనేది సేవింగ్స్ ప్లాన్ కేటగిరీలో ఉండగా.. బీమా కవచ్ అనేది రిస్క్ ప్రొటెక్షన్ ప్లాన్‌ కేటగిరీలో ఉంది. ఈ ప్లాన్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎల్‌ఐసీ ప్రొటెక్షన్ ప్లస్

-18 నుంచి 65 ఏళ్ల వయస్సు వారు అర్హులు

-గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పట్టవచ్చు

-యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ సదుపాయం ఉంది

-పాలసీ తీసుకున్నవారికి మధ్యలో ఏమైనా అయితే బేసిక్‌ సమ్‌ అష్యూర్డ్ అమౌంట్‌తో పాటు బేస్‌ ప్రీమియం ఫండ్‌ వాల్యూ చెల్లిస్తారు.

-మీరు ఎంచుకునే పాలసీ వ్యవధిని బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది

-10,15,20,25 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది. ఇక 5,7,10,15 ఏళ్ల ప్రీమియం చెల్లింపు కాలాన్ని ఎంచుకోవచ్చు.

-పాలసీ తీసుకున్న ఐదేళ్ల తర్వాత మీరు పాక్షికంగా నగదును తీసుకునే అవకాశం ఉంది

బీమా కవచ్ ప్లాన్ వివరాలు

-18 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు

-మినిమం రూ.2 లక్షలతో బీమా మొదలవుతుంది. గరిష్టంగా ఎంతైనా తీసుకోవచ్చు

-ప్రీమియం ఒకేసారి లేదా 5,10,15 ఏళ్లు చెల్లించవచ్చు

-కనిష్ట మెచ్యూరిటీ వయస్సు 28 ఏళ్లుగా ఉండగా గరిష్ట వయస్సు 100 ఏళ్లుగా ఉంది.

-ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబానికి ఆర్ధిక భద్రతగా ఈ ప్లాన్ ఉంటుంది