AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natarajan: టీమిండియా పేసర్‌ గొప్ప మనసు.. యంగ్‌ క్రికెటర్ల కోసం సొంత డబ్బులతో క్రికెట్‌ అకాడమీ

యార్కర్ల స్పెషలిస్ట్‌గా పేరొందిన టీమిండియా పేసర్‌ టి. నటరాజన్‌ కల సాకారమైంది. తన గ్రామంలో క్రికెట్‌ గ్రౌండ్‌ను ఏర్పాటుచేయాలన్న కలను నెరవేర్చుకున్నాడీ పేసర్‌. తాజాగా నటరాజన్‌ క్రికెట్ గ్రౌండ్‌ను భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ప్రారంభించాడు. తన ఊరిలోని యువ ప్రతిభావంతులకు శిక్షణ ఇచ్చేందుకు తగిన వేదికను అందించడమే నటరాజన్ లక్ష్యం.

Natarajan: టీమిండియా పేసర్‌ గొప్ప మనసు.. యంగ్‌ క్రికెటర్ల కోసం సొంత డబ్బులతో క్రికెట్‌ అకాడమీ
Dinesh Kartik, Natarajan
Basha Shek
|

Updated on: Jun 26, 2023 | 1:48 PM

Share

యార్కర్ల స్పెషలిస్ట్‌గా పేరొందిన టీమిండియా పేసర్‌ టి. నటరాజన్‌ కల సాకారమైంది. తన గ్రామంలో క్రికెట్‌ గ్రౌండ్‌ను ఏర్పాటుచేయాలన్న కలను నెరవేర్చుకున్నాడీ పేసర్‌. తాజాగా నటరాజన్‌ క్రికెట్ గ్రౌండ్‌ను భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ప్రారంభించాడు. తన ఊరిలోని యువ ప్రతిభావంతులకు శిక్షణ ఇచ్చేందుకు తగిన వేదికను అందించడమే నటరాజన్ లక్ష్యం. ఇందుకోసం తన గ్రామంలో అన్ని సౌకర్యాలతో కూడిన క్రికెట్ గ్రౌండ్‌ను నిర్మించి తన కలను సాకారం చేసుకున్నాడు. తమిళనాడులోని సేలం సమీపంలోని చిన్నంపట్టి అనే గ్రామంలో నటరాజన్ ఈ క్రికెట్ మైదానాన్ని నిర్మించాడు నజరాజన్‌. తన లాంటి వారు ఎంతోమంది దేశం కోసం ఆడాలి. అందుకు తగిన వేదిక కావాలనే ఏకైక లక్ష్యంతో సొంత డబ్బులతో ఈ స్టేడియాన్ని నిర్మించాడు నటరాజన్. తాజాగా ఈ క్రికెట్‌ గ్రౌండ్‌ ఓపెనింగ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. అశోక్ సిగమణి, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, సేలం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆర్. శివకుమార్ సహా తమిళ సినీ పరిశ్రమకు చెందిన యోగిబాబు తదితరులు హాజరయ్యారు.

‘మా గ్రామంలో పూర్తి స్థాయి క్రికెట్‌ మైదానం ఏర్పాటుచశాను అని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని నటరాజన్ ఎమోషనల్‌ అయ్యాడు. కాగా ఈ క్రికెట్‌ గ్రౌండ్‌కు నటరాజన్ క్రికెట్ గ్రౌండ్ (NCG) అని పేరు పెట్టారు. కాగా 2020 ఐపీఎల్‌ సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు నటరాజన్‌. పదునైన యార్కర్ లతో టీమిండియాలో చోటు సంపాదించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించాడు. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా తరఫున ఆడాడు. అయితే దురదృష్టవశాత్తూ గాయపడడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్ తర్వాత నటరాజన్ వ్యక్తిగత జీవితం కూడా మారిపోయింది. దినసరి కూలీగా ఉండే తన తల్లిదండ్రులకు నటరాజన్ సొంత ఇల్లు కట్టించాడు. అక్కాచెల్లెళ్లకు మంచి చదువులు చెప్పిస్తున్నాడు. ఇప్పుడు అతను తన సొంత క్రికెట్ అకాడమీని కూడా ప్రారంభించాడు. తద్వారా తన గ్రామంలోని ఇతర ప్రతిభావంతులైన ఆటగాళ్లకు క్రికెట్ నేర్చుకోవడానికి మంచి వేదికను అందించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..