AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు కోహ్లీ టీంకి శనిలా దాపురించావన్నారు.. కట్ చేస్తే.. వరుసగా 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీసి.!

జింబాబ్వే వేదికగా జరుగుతోన్న వరల్డ్‌కప్ క్వాలిఫైయర్స్‌ 2023లో శ్రీలంక స్పిన్ మాస్ట్రో వనిందు హసరంగా అదరగొడుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో..

అప్పుడు కోహ్లీ టీంకి శనిలా దాపురించావన్నారు.. కట్ చేస్తే.. వరుసగా 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీసి.!
Hasaranga
Ravi Kiran
|

Updated on: Jun 26, 2023 | 1:55 PM

Share

జింబాబ్వే వేదికగా జరుగుతోన్న వరల్డ్‌కప్ క్వాలిఫైయర్స్‌ 2023లో శ్రీలంక స్పిన్ మాస్ట్రో వనిందు హసరంగా అదరగొడుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఐదేసి వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. 5 వికెట్లు, 6 వికెట్లు, 5 వికెట్లు.. వరుసగా మూడు వన్డేల్లో(16 వికెట్లు) ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి రెండో బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో పాక్ పేసర్ వకార్ యూనిస్(15 వికెట్లు) పేరిట ఉన్న ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో హసరంగా ఒమన్‌పై 13/5, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై 24/6, ఐర్లాండ్‌పై 79/5 గణాంకాలు నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ మ్యాచ్‌లో హసరంగా చెలరేగడంతో శ్రీలంక 133 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో ఐర్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. గ్రూప్‌-బీ నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ జట్లు సూపర్ సిక్స్‌కు చేరుకున్నాయి.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌట్ అయింది. కరుణరత్నే(103) సెంచరీ చేయగా.. సమరవీర(82) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. అసలంక(38), డిసిల్వ (42) రాణించడంతో లంకేయులు భారీ స్కోర్ సాధించారు. అటు ఐర్లాండ్‌ బౌలర్లలో అదైర్‌ 4 వికెట్లు, మెక్‌కార్తీ 3 వికెట్లు, డెలానీ 2 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన ఐర్లాండ్ తడబడింది. హసరంగా స్పిన్‌కు ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో నిర్ణీత ఓవర్లకు 192 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో హసరంగా 5 వికెట్లు, తీక్షణ 2 వికెట్లు, రజిత, కుమార, షనక చెరో వికెట్ పడగొట్టారు. ఐర్లాండ్‌ బ్యాటింగ్ లైనప్‌లో కర్టిస్‌ క్యాంపర్‌ (39) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

కాగా, ఐపీఎల్ 2023లో హసరంగాను రూ. 10 కోట్లకు దక్కించుకుంది బెంగళూరు జట్టు. కానీ అతడి నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన రాలేదు. ఇక ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరకపోవడానికి హసరంగా కూడా కారణమేనని ఫ్యాన్స్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తన మిస్టరీ స్పిన్‌తో శ్రీలంక జట్టును వరల్డ్ కప్‌కు చేరుస్తున్నాడు హసరంగా.