- Telugu News Photo Gallery Cricket photos Shikhar Dhawan may return to lead Team India in 2023 Asian Games, Says Report
Shikhar Dhawan: ‘టీమిండియా’లోకి గబ్బర్ వచ్చేస్తున్నాడు..! ధానవ్ సారథ్యంలో చైనాకు తిలక్, రింకూ కూడా..
Shikhar Dhawan: టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మ్యాన్ శిఖర్ ధావన్ టీమిండియాలోకి తిరిగి రావడం దాదాపుగా ఖాయం అంటున్నాయి తాజా నివేదికలు. సెప్టెంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్‌జౌలో జరిగే ఆసియా క్రీడల్లో భారత జట్టును గబ్బర్ నడిపించబోతున్నాడు.
Updated on: Jun 26, 2023 | 2:42 PM

Shikhar Dhawan: శిఖర్ ధావన్ టీమిండియా నుంచి నిరర్థకంగా స్థానం కోల్పోయినప్పటికీ.. త్వరలో అతను టీమిండియాను నడిపించబోతున్నాడు. అవును, తాజా నివేదికల ప్రకారం చైనా వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో భారత్‌ను అతను కెప్టెన్‌గా వ్యవరించనున్నాడు.

ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న నేపథ్యంలో భారత జట్టును నడిపించే బాధ్యతను శిఖర్ ధావన్‌కు బీసీసీఐ అప్పగిస్తుందని ఆయా నివేదికలు చెబుతున్నాయి. ఇక చైనాకు హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని మహిళల జట్టుతో పాటు ఇండియా బీ టీమ్‌ను బీసీసీఐ పంపించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే చైనాకు వెళ్లే భారత్ బీ జట్టులో గబ్బర్‌తో పాటు పృథ్వీ షా, రింకూ సింగ్, తిలక్ వర్మ లాంటి పేర్లు కూడా ఉండేందుకు అవకాశం ఉంది. గతంలో కూడా భారత్ బీ జట్టుకు శిఖర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

2021లో భారత సీనియర్ల జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లగా.. అదే సమయంలో శిఖర్ నాయకత్వాన భారత్ బీ టీమ్ శ్రీలంకకు వెళ్లింది.

కాగా, భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. అంటే.. ప్రపంచకప్ ఆడే టీమిండియాలో శిఖర్ ధావన్ దాదాపుగా లేనట్టే. అలాగే శిఖర్ స్థానంలో వన్డే ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్న శుభ్‌మన్ గిల్ ఆడటం ఖాయం అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం సాధించేలా చేసే బాధ్యత శిఖర్ ధావన్‌కే దక్కే అవకాశం ఉంది.





























