IND vs WI: మైదానంలో కోహ్లీలా దూకుడు చూపించు.. రోహిత్ శర్మకు కెప్టెన్సీ చిట్కాలు చెప్పిన పాక్ మాజీ క్రికెటర్
ఆసియా కప్ అలాగే ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న భారత్‌కు వెస్టిండీస్ సిరీస్ చాలా ముఖ్యమైనది. వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఆసియా కప్‌కు ముందు భారత్ కు పెద్దగా మ్యాచ్‌లు లేవు. దీంతో వెస్టిండీస్‌లో సిరీస్‌లో గెలిచి రోహిత్ తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో ఓడిపోయిన భారత జట్టు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటోంది. ఆ తర్వాత వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో టీమిండివయా టెస్టు, వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇక వెస్టిండీస్ పర్యటనకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో పలువురు యువ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. దీంతో పాటు టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానె, వన్డే జట్టు వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేశారు. రోహిత్ శర్మ యథావిధిగా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే అంతకుముందు జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడిపోవడంతో కెప్టెన్ రోహిత్‌తో పాటు కొందరు సీనియర్లకు వెస్టిండీస్ టూర్ నుంచి తప్పించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆసియా కప్, ప్రపంచకప్ దృష్ట్యా పూర్తిస్థాయి జట్టును వెస్టిండీస్‌కు పంపుతున్నారు. ఈ క్రమంలో ఆసియా కప్ అలాగే ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న భారత్‌కు వెస్టిండీస్ సిరీస్ చాలా ముఖ్యమైనది. వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఆసియా కప్‌కు ముందు భారత్ కు పెద్దగా మ్యాచ్‌లు లేవు. దీంతో వెస్టిండీస్‌లో సిరీస్‌లో గెలిచి రోహిత్ తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.
ఈక్రమంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ రోహిత్ శర్మకు కెప్టెన్సీ చిట్కాలు ఇచ్చాడు. వెస్టిండీస్ టూర్‌పై తన అభిప్రాయాలను పంచుకున్న ఈ పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు కెప్టెన్‌గా తక్కువ సమయంలో బాగా రాణించాడన్నాడు. అయితే గతంలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి తరహాలో రోహిత్ కూడా మైదానంలో తన ఉనికిని చాటుకోవాలని సూచించాడు. ‘భారత్ బ్యాలెన్స్‌డ్ టీమ్. అయితే జట్టుకు మంచి ఆరంభం కావాలి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మెరుగ్గా రాణించాలని కోరుకుంటున్నాను. విరాట్ కోహ్లి మాదిరిగానే రోహిత్ కూడా మైదానంలో దూకుడు చూపించాలి’ అని పేర్కొన్న అక్మల్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత రోహిత్ శర్మ బాగానే రాణించాడన్నాడు. ఇక వెస్టిండీస్ జట్టుకు టీమిండియాను ఎంపిక చేయడంలో సెలక్షన్ బోర్డు మంచి నిర్ణయం తీసుకుందని చెప్పిన అక్మల్.. సర్ఫరాజ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ (టెస్ట్)లను తప్పించడాన్ని తప్పుపట్టాడు. ‘టీమ్ ఇండియాలో ఒకరిద్దరు ఆటగాళ్ల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. రికార్డులు చూసాక నాకు గుర్తుకు వచ్చే ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. అతను విండీస్ పర్యటనకు ఎంపిక కాలేదు. అయితే అతడికి జట్టులో అవకాశం ఇచ్చి ఉండాల్సింది’ అని చెప్పుకొచ్చాడు అక్మల్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..