AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI Prize Money Tax : టీమిండియా ప్లేయర్లపై కనక వర్షం.. రూ.51 కోట్లకు ఎంత ట్యాక్స్ పడుతుంది?

ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెటర్లపై ప్రస్తుతం సన్మానాలు, నగదు పురస్కారాల వర్షం కురుస్తోంది. బీసీసీఐ ఏకంగా రూ.51 కోట్ల భారీ నగదు బహుమతిని జట్టుకు ప్రకటించింది. గతంతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు ఇప్పుడు అత్యధిక స్థాయిలో పారితోషికం లభిస్తోంది. అయితే, ఈ భారీ మొత్తమంతా ఆటగాళ్లకు పూర్తిగా చేరుతుందా?

BCCI Prize Money Tax : టీమిండియా ప్లేయర్లపై కనక వర్షం.. రూ.51 కోట్లకు ఎంత ట్యాక్స్ పడుతుంది?
Taxes On Indian Cricketers
Rakesh
|

Updated on: Nov 03, 2025 | 8:54 PM

Share

BCCI Prize Money Tax : ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెటర్లపై ప్రస్తుతం సన్మానాలు, నగదు పురస్కారాల వర్షం కురుస్తోంది. బీసీసీఐ ఏకంగా రూ.51 కోట్ల భారీ నగదు బహుమతిని జట్టుకు ప్రకటించింది. గతంతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు ఇప్పుడు అత్యధిక స్థాయిలో పారితోషికం లభిస్తోంది. అయితే, ఈ భారీ మొత్తమంతా ఆటగాళ్లకు పూర్తిగా చేరుతుందా? లేక ఆదాయపు పన్ను, జీఎస్టీ రూపంలో కొంత కోత పడుతుందా? క్రికెటర్ల ఆదాయానికి సంబంధించి పన్ను నిబంధనలు ఎలా ఉన్నాయి? ఒక్కో కేటగిరీకి ఎంత పన్ను భారం పడుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

క్రికెట్ ఆడే క్రీడాకారులు, క్రీడాకారిణులకు మ్యాచ్ ఫీజు, కాంట్రాక్టులు, నగదు బహుమతుల రూపంలో ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంపై భారతీయ ఆదాయపు పన్ను నిబంధనలు వర్తిస్తాయి. క్రీడాకారులకు వచ్చే ఆదాయంపై వార్షికంగా వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను లెక్కింపు జరుగుతుంది. బీసీసీఐ లేదా ఐపీఎల్ వంటి సంస్థలు చెల్లించేటప్పుడే 10% నుంచి 30% వరకు టీడీఎస్‎ను మినహాయించుకుంటాయి.

ప్లేయర్లు తమ వార్షిక ఆదాయపు పన్ను రిటర్న్‌‎ను దాఖలు చేసే సమయంలో ఇప్పటికే కట్ అయిన టీడీఎస్‌ను లెక్కించి, మిగిలిన పన్ను బాకీని చెల్లించాల్సి ఉంటుంది. క్రికెటర్ల ఆదాయం వివిధ రకాలుగా ఉంటుంది, వాటికి వేర్వేరు పన్ను నిబంధనలు వర్తిస్తాయి. బీసీసీఐ, ఐపీఎల్ నిర్వహించే మ్యాచ్‌లలో భారతీయ క్రికెటర్ల మ్యాచ్ ఫీజుపై 10% టీడీఎస్ కట్ చేస్తారు. ఐపీఎల్‌లో ఆడే విదేశీ క్రీడాకారులకైతే 20% టీడీఎస్‌ను మినహాయిస్తారు. దీనితో పాటు ఈ ఆదాయానికి 18% జీఎస్టీ కూడా వర్తిస్తుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లేదా బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్ మనీ వంటి వాటి నుంచి వచ్చే నగదుపై 30% టీడీఎస్ కట్ చేస్తారు. ఈ బహుమతి మొత్తానికి మాత్రం జీఎస్టీ వర్తించదు.

ప్లేయర్లు ప్రకటనలు, కోచింగ్, కామెంటరీ, టీవీ షోలు వంటి వాటి ద్వారా పొందే ఆదాయంపై 10% టీడీఎస్, 18% జీఎస్టీ వర్తిస్తాయి. ఉదాహరణకు, బీసీసీఐ ప్రకటించిన రూ.51 కోట్ల బహుమతిలో ఒక క్రీడాకారిణికి రూ.కోటి లభించింది అనుకుంటే, ఆమెకు పడే పన్ను భారం ఇలా ఉంటుంది. రూ.కోటి బహుమతిగా వస్తే, దీనిపై 30% టీడీఎస్ కట్ చేస్తారు. అంటే, ఆమెకు రూ.70 లక్షలు మాత్రమే అందుతుంది.

ఆ క్రీడాకారిణి మొత్తం వార్షిక ఆదాయం (కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజు, ఇతర బహుమతులు సహా) ఆధారంగా ఆదాయపు పన్ను లెక్కిస్తారు. స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను లెక్కించిన తర్వాత, ఇప్పటికే కట్ అయిన టీడీఎస్‌ను తీసివేసి, మిగిలిన మొత్తాన్ని ఐటీఆర్ దాఖలు సమయంలో ఆ క్రీడాకారిణి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అంటే, రూ.కోటి బహుమతి అందుకుంటే ట్యాక్స్ రూపంలో ఆమె సుమారు రూ.27 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పన్ను చెల్లించాల్సి రావచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..