నెరిసిన జుట్టు.. మాసిన గడ్డం.. గెటప్ మార్చి సర్‌ప్రైజ్ చేసిన టీమిండియా క్రికెటర్.. గుర్తు పడితే మీరు తోపులే
ప్రస్తుతం అందరి దృష్టి టీ 20 ప్రపంచకప్ పైనే ఉంది. బుధవారం (జూన్ 05) ఐర్లాండ్ తో మ్యాచ్ ద్వారా టీమిండియా తన పోరాటాన్ని ప్రారంభించనుంది. ఇక 9వ తేదీన టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక ముసలాయన ప్రపంచకప్ ఏం చూస్తారు? తన ధనాధన్ బ్యాటింగ్ చూడండి అంటున్నారు

ప్రస్తుతం అందరి దృష్టి టీ 20 ప్రపంచకప్ పైనే ఉంది. బుధవారం (జూన్ 05) ఐర్లాండ్ తో మ్యాచ్ ద్వారా టీమిండియా తన పోరాటాన్ని ప్రారంభించనుంది. ఇక 9వ తేదీన టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక ముసలాయన ప్రపంచకప్ ఏం చూస్తారు? తన ధనాధన్ బ్యాటింగ్ చూడండి అంటున్నారు. తన మాటలకు తగ్గట్లు గానే స్థానికంగా యువకులతో క్రికెట్ ఆడాడు. మొదట్లో బంతిని డిఫెన్స్ చేస్తూ నస తెప్పించాడు. అయితే ఆ తర్వాత భారీ షాట్స్ ఆడుతూ యువకులను భయపెట్టాడు. బంతి పడితే చాలు సిక్సులు వెళ్లడంతో కుర్రాళ్లు షాకయ్యారు. దీంతో ఎవరీ ముసలాయన అని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. అక్కడున్నది ఓ టీమిండియా మాజీ క్రికెటర్. . నెరిసిన జట్టు, భారీ గడ్డం, నెత్తికి క్యాప్, స్థానికుల వేషధారణతో ముసలివాడిలా కనిపిస్తోన్న ఈ ఆటగాడిని మీరైనా గుర్తు పట్టారా? చాలా కష్టం అందుకే సమాధానం మేమే చెబుతాం లెండి.
ఈ ముసలోడి గెటప్ లో ఉన్నది మరెవరో టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్. తాజాగా పర్వత ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న యువకుల దగ్గరకు వెళ్లాడు. ముసలోడిలా మేకప్ వేసుకొని వెళ్లడంతో అతడిని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత బ్యాట్ పట్టుకుని భారీ షాట్స్ కొట్టడంతో కుర్రాళ్లు నివ్వెర పోయారు. యువకులు అలా షాక్‌లో ఉండగానే యువరాజ్ బ్యాటింగ్ ఆపేసి తన మేకప్ ను పూర్తిగా తొలగించాడు. దీంతో అక్కడున్న వాళ్లు మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అసలేం జరుగుతుందో నమ్మశక్యం కానట్లు చూస్తూ అలా ఉండిపోయారు. ఆ తర్వాత తేరుకుని యువీతో సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఇది ఒక అడ్వర్టయిజ్మెంట్ కోసం చేసిన వీడియోనని తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్ 2024 కు యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు.
ముసలోడి గెటప్ లో యువరాజ్ సింగ్..
View this post on Instagram
రేపు ఐర్లాండ్ తో మొదటి మ్యాచ్ ఆడనున్న టీమిండియా..
All smiles in New York as #TeamIndia complete a 60-run win in the warmup clash against Bangladesh 👏👏
Scorecard ▶️ https://t.co/EmJRUPmJyn#T20WorldCup pic.twitter.com/kIAELmpYIh
— BCCI (@BCCI) June 1, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




