Dil Diya First Look: దిల్ దియా ఫస్ట్ లుక్ రివీల్ చేసిన సందీప్ రెడ్డి వంగ.. ఊహించని లుక్‌లో ఆ హీరో..
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తుండగా.. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత క్యూరియాసిటీ పెంచేసింది. తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రిలీజ్ చేసిన దిల్ దియా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న చైతన్యరావు మాదాడి కథానాయకుడిగా వెర్సటైల్ డైరెక్టర్ కె.క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న రా అండ్ రూటెడ్ ఫిల్మ్ ‘దిల్ దియా-ఏ నేక్డ్ ట్రూత్’ అనేది ట్యాగ్ లైన్. శ్రియాస్ చిత్రాస్, ఎ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
ఈ సినిమా భావోద్వేగాలు, వ్యక్తిగత సంబంధాల మధ్య వచ్చే సంఘర్షణలను చూపించే ట్రెండింగ్ డ్రామాగా ఉండబోతుంది. కె. క్రాంతి మాధవ్‌కి ‘దిల్ దియా ..ఏ నేక్డ్ ట్రూత్’ ఆయన ఇప్పటివరకు చేసిన భావోద్వేగాత్మక సినిమాల ప్రయాణానికి కొనసాగింపులానే ఉంటుంది. ఆయన తన సినిమాల్లో ఎమోషన్స్‌లో డెప్త్‌తో పాటు బలమైన కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆయన తెరకెక్కించిన ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలను గమనిస్తే.. ప్రేమ, మనసుల్లోని భావాలు, అంతర్గత సంఘర్షణలు పాత్రల రూపంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు మరోసారి క్రాంతి మాధవ్ వైవిధ్యమైన మూవీ ‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’ సినిమాలో నేటి ట్రెండ్‌కు తగినట్లు ప్రేమ, మోహం, వైఫల్యం, వ్యక్తులు లేదా మనసుల మధ్య ఉండే సానిహిత్యం, ఆత్మ గౌరవం వంటి ఎలిమెంట్స్‌పై ఫోకస్ చేస్తూ వంటి ఎమోషనల్ వరల్డ్‌తో ప్రేక్షకులను మెప్పించటానికి సన్నద్ధమవుతున్నారు.
చైతన్యరావు మాదాడి, ఇరా, సఖి, జెస్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో మణి చందన, ప్రమోదిని, వీర శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా నేచురల్‌గా ఉండాలనే ఆలోచనతో డైరెక్టర్ అండ్ టీమ్ నటీనటులను ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీని వల్ల సినిమాలో ఓవర్ డ్రామా లేకుండా నేచురాలిటీ కనిపిస్తుంది. ఎమోషన్స్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి.
ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను గమనిస్తే.. బట్టలు లేకుండా సొఫాలో కూర్చున్న చైతన్య రావు లుక్ ఆశ్చర్యం కలిగిస్తుంది. సోఫాలో నగ్నంగా కూర్చుని సీరియస్‌గా చూస్తున్నాడు. వెనుక నుంచి ప్రొజెక్టర్ లైటింగ్ వస్తోంది. తన చూపుల్లోని ఇంటెన్సిటీ తన పాత్రలోని సీరియస్‌నెస్‌ను తెలియజేస్తోంది. కథలోని విషయాలను రివీల్ చేయకుండా , పాత్రలు వాటికి కావాల్సిన నిజాన్ని వెతుక్కుంటూ సాగే కథగా ఈ సినిమా ఉంటుందనే ఫీల్ కలుగుతుంది. ఈ విజువల్ శైలి క్రాంతి మాధవ్ సినిమా దృక్పథానికి దగ్గరగా ఉంది, అక్కడ స్టైల్ కన్నా భావోద్వేగాల నిజాయితీ, స్పష్టతకే ఎక్కువ ప్రాముఖ్యత కనిపిస్తోంది. ఈ సినిమా 2026 సమ్మర్లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
Here’s the first look poster of my dear friend's @bykranthi 5th film 🔥 WISHING YOU ALL THE LUCK 🤗CONGRATULATIONS 🎊 Poster is very intriguing and deep 🤝#DILDIYA @IamChaitanyarao @bykranthi @Ira_dayanand @PoornaNaiduProd @phanikalyang @pgvinda @beyondmediapres… pic.twitter.com/4YrwlglagQ
— Sandeep Reddy Vanga (@imvangasandeep) January 3, 2026
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
