AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Exams 2026: ఇక పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు.. ఇంటర్ బోర్డు నయా స్కెచ్!

గతేడాది కొన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఇన్‌స్టాల్‌ చేయలేదని, ఈసారి అకడమిక్​ క్యాలెండర్ మొదలైనప్పటి నుంచి సర్కిలర్​ జారీ చేసిటన్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల మేనేజ్​మెంట్​లు దీనిలో భాగస్వామ్యమయ్యాయని అన్నారు. కాలేజీల్లోని ఈ కెమెరాలను కంట్రోల్​ రూమ్‌ సర్వర్‌తో అనుసంధానం..

Inter Exams 2026: ఇక పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు.. ఇంటర్ బోర్డు నయా స్కెచ్!
Exam Command Control Centre For Inter Exams
Srilakshmi C
|

Updated on: Feb 11, 2026 | 9:25 AM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11: తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో పకడ్భందీగా నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాల మేరకు గత ఏడాది నుంచే కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించామన్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్​ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టి సెంట్రలైజ్డ్​ కంట్రోల్​ రూమ్‌లో మోనిటర్​ చేస్తుంటారు. సరిగ్గా ఇదే మాదిరి ఇంటర్ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నామని కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. అయితే ఎన్నికలు ఒక్క రోజు మాత్రమే ఈ విధానం ఉంటుంది. కానీ 2 వారాల పాటు జరిగే ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలు, మూడు వారాలు నిర్వహించే థియరీ పరీక్షలు అన్ని రోజుల్లో సెంట్రలైజ్డ్​ కంట్రోల్​ రూమ్‌లో మోనిటర్​ ఉంటుందని వివరించారు.

గతేడాది కొన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఇన్‌స్టాల్‌ చేయలేదని, ఈసారి అకడమిక్​ క్యాలెండర్ మొదలైనప్పటి నుంచి సర్కిలర్​ జారీ చేసిటన్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల మేనేజ్​మెంట్​లు దీనిలో భాగస్వామ్యమయ్యాయని అన్నారు. కాలేజీల్లోని ఈ కెమెరాలను కంట్రోల్​ రూమ్‌ సర్వర్‌తో అనుసంధానం చేసుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల్లో 1440 సీసీ కెమెరాలు ఉన్నట్లు తెలిపారు. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమెష్ట్రీ ల్యాబ్‌తో పాటు ప్రశ్న పత్రం ఓపెన్ చేసే గదుల్లో, మార్కులు వేసే ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మానిటరింగ్‌కు కమాండ్​ కంట్రోల్లో 100 మంది స్టాఫ్​ ఉన్నారని ఆయన తెలిపారు. మొత్తం 36 స్క్రీన్లు అందుబాటులో ఉండగా.. ఒక్కో స్క్రీన్‌కు ముగ్గురు స్టాఫ్‌లను కేటాయించామని అన్నారు.

ప్రశ్న పత్రం ఓపెన్ చేసినప్పటి నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు వీరు నిరాటంకంగా మానిటరింగ్ చేస్తారని బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ ప్రక్రియలో ఏ సెంటర్లలో అయినా స్లిప్స్ వచ్చినట్లు గుర్తించినా, కాపీ కొడుతున్నట్లు మోనిటరింగ్‌లో తేలితే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. వీరితో పాటు ప్రతి జిల్లాలో డీఈసీ (డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ)కి సంబంధించిన ఫ్లైయింగ్ స్క్వాడ్స్, సిటింగ్​ స్క్వాడ్స్ పూర్తిగా అందుబాటులో ఉంటారు. వీరి విధులను కూడా సీసీకెమెరాల ద్వారా మోనిటరింగ్ ఉంటుంది. మోనిటరింగ్‌కి ముందు స్పెల్‌ ప్రక్రియ జరిగినట్లు తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు సుమారు 968 సెంటర్లలో ఈ పరీక్ష ప్రక్రియ జరిగింది. ఈ మానిటరింగ్‌ సమయంలో ఏదైనా పరీక్షా కేంద్రం తప్పుజరిగినట్లు అధికారులు గుర్తిస్తే అప్పటి కప్పుడు ఇన్​స్పెక్షన్​ టీమ్‌ను పంపించి, వారి రిపోర్టు ఆధారంగా అక్కడి ఎగ్జామినర్‌ను రీకాల్​ చేస్తున్నామన్నారు. ఏదైనా కంప్లెంట్స్ వస్తే మాల్ ప్రాక్టీస్​ కమిటీ అందరినీ రిఫల్ చేస్తుందని, పైగా సీసీ కెమెరాల ఫుటేజీ ఒక నెల రోజులపాటు ఉంటుందని వివరించారు. పరీక్షలు రాస్తున్న సమయంలో విద్యార్థులు కదిలిన ప్రతి సారీ ఓ గ్రీన్​ లైట్‌ వెలుగుతుందని, దీంతో ఆ విద్యార్థిపై నిఘా పెట్టడం మరింత సులభతరం అవుతుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఇక ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు..!
ఇక ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు..!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. పూర్తి వివరాలు ఇదిగో..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. పూర్తి వివరాలు ఇదిగో..
ప్రెజర్ కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ సమస్య ఇలా ఫిక్స్ చేయండి..
ప్రెజర్ కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ సమస్య ఇలా ఫిక్స్ చేయండి..
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?
సర్వరోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే నాలుకు ఇగుర్లు చాలు..
సర్వరోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే నాలుకు ఇగుర్లు చాలు..
మా కూతురిని హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. ప్రియాంక భర్త
మా కూతురిని హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. ప్రియాంక భర్త
రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్
మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!
మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!