AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. పూర్తి వివరాలు ఇదిగో..

తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజించింది. జీహెచ్‌ఎంసీ(GHMC)తో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (CMC), మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MMC)గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Hyderabad: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. పూర్తి వివరాలు ఇదిగో..
Telangana CM Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Feb 11, 2026 | 9:24 AM

Share

తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజించింది. జీహెచ్‌ఎంసీ(GHMC)తో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (CMC), మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MMC)గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా.. ఈ మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ను యథాతథంగా కొనసాగించగా.. సీఎంసీకి శ్రీజన, ఎంఎంసీకి వినయ్‌ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ గా స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఐఏఎస్ కొనసాగనున్నారు.

ప్రస్తుత GHMC హెడ్ ఆఫీస్ లోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కొనసాగనుంది. తార్నాక హుడా కార్యాలయంలో గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్ ఆఫీస్, మాదాపూర్ నాక్ బిల్డింగ్ లో గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ ఆఫీస్ ఉండనుంది. 150 వార్డు లతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్..74 వార్డులతో గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్, 76 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ ఉండనుంది.

కార్పొరేషన్ జోన్లు.. ప్రాంతాలు ఇలా..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌- GHMC

ఖైరతాబాద్, చార్మినార్‌ జోన్లతోపాటు సికింద్రాబాద్, ఎల్బీనగర్‌ జోన్లలోని కొన్ని ఏరియాలు, బండ్లగూడజాగీర్, శంషాబాద్, జల్‌పల్లి, బడంగ్‌పేట్, తుక్కుగూడ, ఆదిభట్ల, తుర్కయాంజాల్, మీర్‌పేట్, పెద్దఅంబర్‌పేట అన్నీ ఒక కార్పొరేషన్‌లో ఉంటాయి. ఖైరతాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, చార్మినార్, శంషాబాద్, రాజేంద్రనగర్‌ జోన్లుతో GHMC ఉంటుంది.

సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌-CMC ..

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లతోపాటు నార్సింగి, మణికొండ, తెల్లాపూర్, అమీన్‌పూర్, బొల్లారం, నిజాంపేట్, దుండిగల్‌, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ ఇందులో ఉంటాయి. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ జోన్లు కలిపి ఇప్పుడు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌-CMC ఏర్పాటైంది.

మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌-MMC

ఎల్బీనగర్, సికింద్రాబాద్‌లో కొన్ని జోన్లతోపాటు బోడుప్పల్, ఫీర్జాదిగూడ, పోచారం, ఘట్‌కేసర్, నాగారం, దమ్మాయిగూడ, జవహర్‌నగర్, తూముకుంటతో మరో కార్పొరేషన్‌ ఏర్పాటైంది. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్‌ జోన్లుగా మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌-MMC అయ్యింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..