AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సిగ్నల్‌ జంప్ చేస్తే షాక్‌.. ఓవర్‌ స్పీడుకు బ్రేకులు..రూల్స్ బ్రేక్ చేస్తే తాటతీస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

ఆ ఎవరు చూస్తారులే, అని సిగ్నల్‌ జంపింగ్‌ చేస్తే.. ఇక కుదరదు గాక కుదరదు. రోడ్డు బాగుంది కదా అని ఓవర్‌ స్పీడుతో రయ్‌మని దూసుకుపోతానంటే.. పోలీసులు మీ బండికి బ్రేకులేస్తున్నారు. మైనర్లు వెహికల్‌తో రోడ్డెక్కితే.. పేరెంట్స్‌పై కేసులు నమోదవుతాయి. యస్‌. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల కట్టడి కోసం, ట్రాఫిక్‌ పోలీసులు సీరియస్ యాక్షన్‌లోకి దిగారు.

Hyderabad: సిగ్నల్‌ జంప్ చేస్తే షాక్‌.. ఓవర్‌ స్పీడుకు బ్రేకులు..రూల్స్ బ్రేక్ చేస్తే తాటతీస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు
Traffic Police On Wrong Route Driving
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Feb 11, 2026 | 9:23 AM

Share

ఆ ఎవరు చూస్తారులే, అని సిగ్నల్‌ జంపింగ్‌ చేస్తే.. ఇక కుదరదు గాక కుదరదు. రోడ్డు బాగుంది కదా అని ఓవర్‌ స్పీడుతో రయ్‌మని దూసుకుపోతానంటే.. పోలీసులు మీ బండికి బ్రేకులేస్తున్నారు. మైనర్లు వెహికల్‌తో రోడ్డెక్కితే.. పేరెంట్స్‌పై కేసులు నమోదవుతాయి. యస్‌. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల కట్టడి కోసం, ట్రాఫిక్‌ పోలీసులు సీరియస్ యాక్షన్‌లోకి దిగారు. సిగ్నల్ జంపింగ్ నుంచి ఓవర్‌ స్పీడ్ వరకూ.. రాంగ్ రూట్ నుంచి ప్రమాదాల వరకూ.. అనేక అంశాలపై నజర్ పెట్టారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌ మహానగరంలో రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు కేవలం 8 రోజుల్లోనే 21,713 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్‌ పోలీసులు మంగళవారం (ఫిబ్రవరి 10) విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ వల్ల నగరంలో ట్రాఫిక్‌ జామ్‌లు పెరగడమే కాకుండా, రోడ్డు మీద ప్రయాణించే వారికి ఇది ప్రాణాపాయంగా మారుతోందని పోలీసులు స్పష్టం చేశారు.

ట్రాఫిక్‌ నియమాలు పాటించే వాహనదారులకు అడ్డంకులు ఏర్పడటంతో పాటు, రోడ్డు మీద గందరగోళం ఏర్పడి ప్రమాదాలు జరగడానికి ఇదే ప్రధాన కారణంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ తరహా ఉల్లంఘనలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు, అలాగే సోషల్‌ మీడియా ద్వారా సెన్సిటైజేషన్‌ కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

అలాగే, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ వంటి ట్రాఫిక్‌ ఉల్లంఘనలను ప్రజలు నేరుగా పోలీసులకు తెలియజేయాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం వారి అధికారిక సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ఫేస్‌బుక్‌, ఎక్స్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై సమాచారం ఇవ్వడానికి ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ 9010203626, ఈ-చలాన్‌ సంబంధిత సమస్యల కోసం హెల్ప్‌డెస్క్‌ 8712661690ను సంప్రదించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రేమ బంధాన్ని పదే పదే చెక్ చేస్తున్నారా?
ప్రేమ బంధాన్ని పదే పదే చెక్ చేస్తున్నారా?
హఠాత్తుగా క్లాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త స్టూడెంట్‌!ఏం చేసిందంటే
హఠాత్తుగా క్లాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త స్టూడెంట్‌!ఏం చేసిందంటే
ఒంటరితనం గుండెకు శాపం! నలుగురిలో ఉంటే హార్ట్‌ అటాక్ రాదా?
ఒంటరితనం గుండెకు శాపం! నలుగురిలో ఉంటే హార్ట్‌ అటాక్ రాదా?
పీఎం కిసాన్ నిధులు విడుదల.. అకౌంట్లోకి రూ.2 వేలు వచ్చేశాయి
పీఎం కిసాన్ నిధులు విడుదల.. అకౌంట్లోకి రూ.2 వేలు వచ్చేశాయి
నా తండ్రి మరణాన్ని ఇలా వాడుకుంటారా? డీమాన్ పవన్ ఆగ్రహం
నా తండ్రి మరణాన్ని ఇలా వాడుకుంటారా? డీమాన్ పవన్ ఆగ్రహం
గురక, ఆఫీస్ ఒత్తిడి.. నిద్ర కోసం దూరంగా ఉంటున్న జంటలు!
గురక, ఆఫీస్ ఒత్తిడి.. నిద్ర కోసం దూరంగా ఉంటున్న జంటలు!
నీట్ యూజీ దరఖాస్తులో పొరపాటు చేశారా..? దిద్దుబాటుకు ఇక ఒక రోజే..
నీట్ యూజీ దరఖాస్తులో పొరపాటు చేశారా..? దిద్దుబాటుకు ఇక ఒక రోజే..
ఒకప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు టీమిండియా తోపు బౌలర్ భార్య..
ఒకప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు టీమిండియా తోపు బౌలర్ భార్య..
ముందు బంగారం పెరిగింది.. ఇప్పుడు గ్యాస్.. ప్రజలకు మరో బిగ్ షాక్?
ముందు బంగారం పెరిగింది.. ఇప్పుడు గ్యాస్.. ప్రజలకు మరో బిగ్ షాక్?
ఐపీఎల్ చరిత్రలో వికెట్ల సునామీ సృష్టించింది వీరే
ఐపీఎల్ చరిత్రలో వికెట్ల సునామీ సృష్టించింది వీరే