AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : ప్రభాస్‏కి కోపం వస్తే ముందుగా చేసే పని ఇదే.. కంట్రోల్ చేయాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి.. నటుడు ప్రభాస్ శ్రీను..

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. కల్కి, సలార్ సినిమాల తర్వాత ఇప్పుడు తన కామెడీ టైమింగ్ తో అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. జనవరి 9న ఆయన నటించిన రాజాసాబ్ సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో డార్లింగ్ స్నేహితుడు ప్రభాస్ శ్రీను చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Prabhas : ప్రభాస్‏కి కోపం వస్తే ముందుగా చేసే పని ఇదే.. కంట్రోల్ చేయాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి.. నటుడు ప్రభాస్ శ్రీను..
Prabhas, Prabhas Srinu
Rajitha Chanti
|

Updated on: Jan 03, 2026 | 5:58 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు డార్లింగ్. స్పిరిట్, ఫౌజీ సినిమాలు షూటింగ్ జరుపుకుంటుండగా.. రాజాసాబ్ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ స్నేహితుడు నటుడు ప్రభాస్ శ్రీను గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..

నటుడు ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ.. హరీష్ శంకర్, పరశురామ్, బుజ్జి, రాజమౌళి (ముందు రోజుల్లో), వి.వి. వినాయక్, కరుణాకరన్ వంటి దర్శకులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని అన్నారు.. తాను డబ్బు కంటే సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఒక కొత్త సినిమా చేసేటప్పుడు దర్శకుడితో పరిచయం ఏర్పడితే చాలని, అది తన కెరీర్‌కు మరింత ప్రయోజనకరమని అన్నారు. ఇంటి దగ్గర ఉంటే ఖర్చులు పెరుగుతాయని, షూటింగ్‌కు వెళితే పది, ఇరవై రూపాయలు అయినా చేతికి వస్తాయనే ఆలోచనతో పనిచేసేవాడినని చెప్పారు. తన చిన్నతనం నుండి చురుకుగా ఉన్నప్పటికీ, హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని అలవాట్ల వల్ల ఆరోగ్యంపై నిర్లక్ష్యం పెరిగిందని అన్నారు. ఈ విషయంలో ప్రభాస్ తనను చాలాసార్లు మందలించారని, అయితే అది తన వ్యక్తిగత ఎంటర్‌టైన్‌మెంట్ అని భావించి వదులుకోలేకపోయానని తెలిపారు.

ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..

అలాగే ప్రభాస్ కనిపించినంత సైలెంట్ కాదని.. కోపం వస్తే చాలా వైలెంట్ గా ఉంటారని అన్నారు. ప్రభాస్ కు కోపం వస్తే సైలెంట్ అయిపోతారని.. ఆయనకు ఎందుకు కోపం వచ్చింది.. ? ఏ విషయానికి కోపం వచ్చింది ? అనేది కూడా అర్థం కాదని అన్నారు. మాట్లాడకుండానే చాలా బీభత్సమైన వైలెన్స్ సృష్టిస్తారని చెప్పుకొచ్చారు. కోపంలో ఉన్న ప్రభాస్ ను తిరిగి మాములు స్థితికి తీసుకురావాలి అంటే ఎంతో టాలెంట్ ఉండాలని అన్నారు. ప్రస్తుతం ప్రభాస్ శ్రీను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి :  Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‏ను గెలిచి.. ఇప్పుడు ఇలా..

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..