AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar FreeRisks : అయ్యబాబోయ్.. మీ ఫేవరెట్ ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే ఆ పదార్థం మీ బ్రెయిన్‌ను చంపేస్తోందా?

బరువు తగ్గాలన్నా లేదా మధుమేహాన్ని నియంత్రించాలన్నా చాలామంది చక్కెర కంటే 'షుగర్ ఫ్రీ' ప్రత్యామ్నాయాలకే ప్రాధాన్యత ఇస్తారు. అందులో ముఖ్యంగా 'ఎరిత్రిటాల్' (Erythritol) సురక్షితమైనదని భావించి ఎనర్జీ డ్రింక్స్, ప్రోటీన్ బార్స్ కీటో డైట్లలో విరివిగా వాడుతున్నారు. అయితే, తాజా పరిశోధనలు ఈ స్వీటెనర్ గురించి విస్తుపోయే విషయాలను వెల్లడిస్తున్నాయి. ఇది మన మెదడును రక్షించే 'బ్లడ్-బ్రెయిన్ బారియర్'ను దెబ్బతీస్తూ, పక్షవాతం (Stroke) వచ్చే ప్రమాదాన్ని పెంచుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Sugar FreeRisks : అయ్యబాబోయ్.. మీ ఫేవరెట్ ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే ఆ పదార్థం మీ బ్రెయిన్‌ను చంపేస్తోందా?
Sugar Alcohol Side Effects
Bhavani
|

Updated on: Feb 11, 2026 | 10:49 AM

Share

కొలరాడో విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం, ఎరిత్రిటాల్ వినియోగం వల్ల మెదడుకు వెళ్లే రక్తనాళాల్లోని కణాలు దెబ్బతింటున్నాయి. సాధారణంగా మన మెదడులోకి హానికరమైన పదార్థాలు చేరకుండా ఈ కణాలు రక్షణ కవచంలా పనిచేస్తాయి. కానీ, మనం ఒక సాఫ్ట్ డ్రింక్ తాగినప్పుడు శరీరంలోకి చేరే ఎరిత్రిటాల్ స్థాయిలు ఈ కణాలపై ‘ఆక్సిడేటివ్ స్ట్రెస్’ను కలిగిస్తున్నాయి. దీనివల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయే ప్రమాదం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

మెదడు రక్షణ వ్యవస్థపై దాడి

ఎరిత్రిటాల్ శరీరంలోకి చేరగానే ఫ్రీ రాడికల్స్‌ను విడుదల చేసి, శరీరంలోని సహజ యాంటీఆక్సిడెంట్లను బలహీనపరుస్తుంది. దీనివల్ల రక్తనాళాలు వ్యాకోచించే శక్తిని కోల్పోతాయి. సాధారణంగా రక్తనాళాలు అవసరానికి తగినట్లుగా వెడల్పు అవ్వడానికి ఉపయోగపడే ‘నైట్రిక్ ఆక్సైడ్’ ఉత్పత్తిని ఇది తగ్గించి, రక్తనాళాలను గట్టిపరిచే ‘ఎండోథెలిన్-1’ను పెంచుతుంది. ఈ అసమతుల్యత వల్ల మెదడులో రక్తపు గడ్డలు (Blood Clots) ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇది ఇస్కీమిక్ స్ట్రోక్‌కు దారితీస్తుంది.

సహజ రక్షణను సైతం దెబ్బతీస్తూ..

సాధారణంగా మన రక్తనాళాల్లో క్లాట్లు ఏర్పడితే, శరీరం ‘టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్’ అనే సహజ పదార్థాన్ని విడుదల చేసి ఆ గడ్డలను కరిగిస్తుంది. కానీ, ఎరిత్రిటాల్ ఈ రక్షణ వ్యవస్థను కూడా అడ్డుకుంటోందని ప్రయోగశాల ఫలితాలు చెబుతున్నాయి. దీనివల్ల రక్తం గడ్డకట్టే ముప్పు రెండు రెట్లు పెరుగుతుందని గతంలో వేలమందిపై జరిపిన పరిశోధనలు కూడా ధృవీకరిస్తున్నాయి. కేవలం ప్రయోగశాలలోనే కాకుండా, వాస్తవంగా మనుషుల్లో కూడా గుండెపోటు స్ట్రోక్ రేట్లు పెరుగుతున్నట్లు గుర్తించారు.

తీపి వెనుక జాగ్రత్త అవసరం

ఎరిత్రిటాల్‌ను ఎఫ్‌డీఏ (FDA) వంటి సంస్థలు సురక్షితమైనదిగా ఆమోదించినప్పటికీ, అది మెదడు గుండెపై చూపుతున్న ప్రభావం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా చక్కెరను తగ్గించుకోవాలని చూసేవారు ఇటువంటి కృత్రిమ లేదా సహజ స్వీటెనర్ల విషయంలో అతిగా వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏ చక్కెర ప్రత్యామ్నాయం కూడా పూర్తిగా ముప్పు లేనిది కాదని ఈ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. తీపి రుచి కోసం ఆరోగ్యంతో చెలగాటం ఆడకూడదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా స్వీటెనర్లు వాడుతున్న వారు వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర