AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంట్రా ఇది.. చిల్ అవుదామని గోవా వెళ్లి చిల్లర వేశాలు.. విదేశీ మహిళతో అలా చేసి..

ఎంజాయ్ చేయడానికి తెలంగాణ నుంచి గోవా వెళ్లారు.. అంతవరకు బాగానే ఉంది.. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయగా.. విదేశీ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటనలో ఇద్దరు తెలంగాణ వ్యక్తులను గోవా పోలీసులు అరెస్టు చేశారు.. గోవాలో ఓ విదేశీ మహిళను వేధించిన ఘటన కలకలం రేపుతోంది.

ఏంట్రా ఇది.. చిల్ అవుదామని గోవా వెళ్లి చిల్లర వేశాలు.. విదేశీ మహిళతో అలా చేసి..
Goa (representative image)
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Feb 11, 2026 | 10:32 AM

Share

ఎంజాయ్ చేయడానికి తెలంగాణ నుంచి గోవా వెళ్లారు.. అంతవరకు బాగానే ఉంది.. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయగా.. విదేశీ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటనలో ఇద్దరు తెలంగాణ వ్యక్తులను గోవా పోలీసులు అరెస్టు చేశారు.. గోవాలో ఓ విదేశీ మహిళను వేధించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసులో తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గోవాలోని ఓ బీచ్ ప్రాంతంలో విదేశీ మహిళను కొందరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించి వేధించినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఈ ఘటనకు పాల్పడిన వారు తెలంగాణకు చెందినవారని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

గోవాకు వచ్చే పర్యాటకుల భద్రత, గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూ గోవా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. టూరిస్టులు అంగీకారం లేకుండా వారితో ఫొటోలు, సెల్ఫీలు తీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. అవసరమైతే అలాంటి వారిని అరెస్ట్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటకులు వేధింపులకు గురి కాకుండా ఉండేందుకు, ముఖ్యంగా వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పర్యాటకుల అనుమతి లేకుండా అపరిచితులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు లేదా ఫొటోగ్రాఫర్లు వారి ఫొటోలు తీయకూడదని, అలాగే ఆ ఫొటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా నిషేధమని స్పష్టం చేశారు. ఫొటోలు తీసేందుకు అనుమతి ఇవ్వాలని పర్యాటకులపై ఒత్తిడి చేయడం, బలవంతపెట్టడం కూడా తప్పేనని పోలీసులు పేర్కొన్నారు. అయితే బీచ్‌లు, పబ్లిక్ ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలు వంటి ప్రాంతాల్లో సాధారణంగా ఫొటోలు తీసుకోవచ్చని తెలిపారు. కానీ ఆ సందర్భంలో కూడా ఎవరినైనా వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఫొటోగ్రఫీ చేయకూడదని, అది కూడా నియమావళికి విరుద్ధమేనని హెచ్చరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..