AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్వరోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే నాలుగు ఇగుర్లు చాలు.. ఎవరికీ తెలియని వేపాకు సీక్రెట్స్ ఇదిగో..

ఆయుర్వేద సంప్రదాయం నుండి ఆధునిక సైన్స్ వరకు.. భారతీయ సంస్కృతిలో వేప చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ఋషులు వేపలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలను ప్రాచీన కాలంలోనే గుర్తించారు. పంటలకు పురుగు మందుగా, బియ్యంలో పురుగు పట్టకుండా, క్రిమికీటకాలను నివారించడానికి వేపను ఉపయోగించేవారు. ఆధునిక శాస్త్ర పరిశోధనలు కూడా ఈ ప్రయోజనాలను నిర్ధారించాయి.

సర్వరోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే నాలుగు ఇగుర్లు చాలు.. ఎవరికీ తెలియని వేపాకు సీక్రెట్స్ ఇదిగో..
Neem Leaves
Shaik Madar Saheb
|

Updated on: Feb 11, 2026 | 9:59 AM

Share

ఆయుర్వేద సంప్రదాయం నుండి ఆధునిక సైన్స్ వరకు.. భారతీయ సంస్కృతిలో వేప చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ఋషులు వేపలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలను ప్రాచీన కాలంలోనే గుర్తించారు. పంటలకు పురుగు మందుగా, బియ్యంలో పురుగు పట్టకుండా, క్రిమికీటకాలను నివారించడానికి వేపను ఉపయోగించేవారు. ఆధునిక శాస్త్ర పరిశోధనలు కూడా ఈ ప్రయోజనాలను నిర్ధారించాయి. అంతేకాకుండా పురాతన కాలం నుంచి వేప చెట్టుకు పూజలు కూడా చేస్తారు. వేప చెట్టుకు పసుపు రాసి, బొట్లు పెట్టి ప్రదక్షిణలు కూడా చేస్తారు. వేపాకులు (Neem leaves) అద్భుతమైన ఔషధ గుణాలు.. పోషకాల గని. ఇందులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు (కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మ వ్యాధులు, మధుమేహం, జీర్ణ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి.

వేపలో దాగి ఉన్న అద్భుతమైన ప్రయోజనాలను శాస్త్రవేత్తలు నాలుగు ముఖ్యమైన పరిశోధనల ద్వారా నిరూపించారు. అవేంటో తెలుసుకుందాం..

మొదటిది: నింబల్ ఫ్లేవోన్..

2015వ సంవత్సరంలో భారతదేశంలోని వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వేపలో నింబల్ ఫ్లేవోన్ అనే రసాయనాన్ని గుర్తించారు. ఈ రసాయనం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ గుణాలను కలిగి ఉంటుందని, క్రిములను సమర్థవంతంగా చంపుతుందని వారు స్పష్టంగా నిరూపించారు.

రెండవది: అజాదిరచిటిన్..

జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ హెన్రిచ్ కు చెందిన శాస్త్రవేత్తలు 2011వ సంవత్సరంలో వేపలో అజాదిరచిటిన్ అనే రసాయనం ఉందని కనుగొన్నారు. వేప నూనెలో ఉండే ఈ రసాయనం తలకు అప్లై చేసిన 10 నుండి 15 నిమిషాల్లో తలలోని పేలను పూర్తిగా నిర్మూలిస్తుందని వారి పరిశోధనలు నిరూపించాయి.

మూడవది: నింబిడిన్

2014వ సంవత్సరంలో ఇండోనేషియాలోని యూనివర్సిటీ ఆఫ్ గడ్జా మడ శాస్త్రవేత్తలు వేపలో నింబిడిన్ అనే రసాయనాన్ని కనుగొన్నారు. ఈ నింబిడిన్ ప్యాంక్రియాస్ గ్రంథిలోని బీటా కణాలను ఉత్తేజపరిచి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తుందని, తద్వారా షుగర్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుందని వెల్లడించారు. ఈ రసాయనం ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా దోహదపడుతుంది.

నాల్గవది: నింబిడాల్

అమెరికాలోని రోస్వెల్ పార్క్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ శాస్త్రవేత్తలు 2014లో వేపలో నింబిడాల్ అనే రసాయనాన్ని గుర్తించారు. ఈ రసాయనం క్యాన్సర్ కణాలు వాటంతట అవే చనిపోయేలా (అపోప్టోసిస్) ప్రేరణ కలిగిస్తుందని, క్యాన్సర్ వృద్ధిని అదుపు చేయడానికి, తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని వారు నిరూపించారు.

ఈ నాలుగు రకాల పరిశోధనలు వేపలో ఉన్న ఔషధ గుణాలను, శక్తివంతమైన మెడిసిన్స్ లాగా ఇవి జబ్బులను తగ్గించడానికి పనికొస్తున్నాయని రుజువు చేశాయి.

వేపాకులతో ఎన్నో సమస్యలు దూరం..

పైన చెప్పిన ప్రయోజనాలతో పాటు, వేపను సాంప్రదాయకంగా అనేక ఇతర అవసరాలకు ఉపయోగిస్తారు. వేపాకు నీటిని ఎనిమాగా వాడితే పొట్టలోని పురుగులు నశిస్తాయి. వేపాకు పసరును గజ్జలు, చంకల్లో దురదలకు, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు రాస్తే ఉపశమనం లభిస్తుంది. వేప నూనెను సోరియాసిస్ ఉన్నవారు వాడితే పుండ్లు మానడానికి, దురదలు తగ్గడానికి, ఇన్ఫెక్షన్లు నివారించడానికి మంచిది. వేప ఆకులు తింటే కఫం తగ్గి, గొంతులోని ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వేపపుల్లతో పళ్లు తోముకుంటే నోటిలోని బ్యాక్టీరియాలు, లాలాజలంలోని హానికర క్రిములు చనిపోయి దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వ్యవసాయ రంగంలో కూడా వేపకు కీలక పాత్ర ఉంది. పంటలకు పురుగు మందులుగా, బియ్యంలో పురుగు పట్టకుండా వేపనూనె, వేపచెక్క, వేపాకు కషాయాలను ఉపయోగిస్తారు. ఇన్ని లాభాలను అందిస్తున్న వేప చెట్టుకు కృతజ్ఞతగా మన సంస్కృతిలో పసుపు రాసి, బొట్టు పెట్టి ప్రదక్షిణలు చేసే ఆచారం ఉంది. వేప ఔషధ గుణాలను తెలుసుకొని, అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

ఉదయాన్నే నాలుగు వేపాకుల ఇగుర్లు నేరుగా తినడం లేదా వేపాకుల నీటిని తాగడం మంచిది.. డైలీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

అయితే.. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే.. వైద్యులను, ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం మంచిది..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..