Hardik Pandya : 6,6,6,6,6,4..హార్దిక్ ఊచకోత..62 బంతుల్లో 66 పరుగుల నుంచి..ఒక్క ఓవర్లోనే సెంచరీ పూర్తి!
Hardik Pandya : రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో శనివారం (జనవరి 3) విదర్భతో జరిగిన ఈ మ్యాచ్‌లో బరోడా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 71 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి తడబడుతున్న సమయంలో 7వ నంబర్ బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు.

Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ పాత రోజులను గుర్తుకు తెచ్చాడు. 2026 టీ20 వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో, తాను ఎంతటి ప్రమాదకరమైన ఆటగాడినో మరోసారి నిరూపించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బరోడా తరపున బరిలోకి దిగిన హార్దిక్, విధ్వంసకర బ్యాటింగ్‌తో విదర్భ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 68 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాదడమే కాకుండా, ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ ఇన్నింగ్స్‌తో హార్దిక్ తన వన్డే (లిస్ట్-ఏ) కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేయడం విశేషం.
రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో శనివారం (జనవరి 3) విదర్భతో జరిగిన ఈ మ్యాచ్‌లో బరోడా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 71 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి తడబడుతున్న సమయంలో 7వ నంబర్ బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. మొదట తన అన్న కృనాల్ పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన హార్దిక్, కృనాల్ (65 పరుగుల భాగస్వామ్యం తర్వాత) అవుట్ అయ్యాక తన విశ్వరూపాన్ని చూపించాడు. అప్పటివరకు నెమ్మదిగా ఆడిన హార్దిక్, ఒక్కసారిగా గేర్ మార్చి బౌండరీల వర్షం కురిపించాడు.
హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చూస్తుంటే విదర్భ బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన పి.ఆర్. రేఖాడేను హార్దిక్ టార్గెట్ చేశాడు. ఆ ఓవర్లో వరుసగా ఐదు బంతులకు ఐదు భారీ సిక్సర్లు బాది మైదానాన్ని షేక్ చేశాడు. చివరి బంతికి ఫోర్ కొట్టడంతో ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 34 పరుగులు వచ్చాయి. ఆ ఫోర్‌తోనే హార్దిక్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మెరుపు దాడితో బరోడా స్కోరు బోర్డు ఒక్కసారిగా పరుగులు పెట్టింది.
6,6,6,6,6,4 BY HARDIK PANDYA TO BRING HIS FIRST HUNDRED IN LIST A CRICKET…!!! 🥶
– The Madman of Indian Cricket. pic.twitter.com/7ib5UFTOMR
— Johns. (@CricCrazyJohns) January 3, 2026
సెంచరీ తర్వాత కూడా హార్దిక్ జోరు తగ్గలేదు. కేవలం 92 బంతుల్లోనే 133 పరుగులు చేసి తన లిస్ట్-ఏ కెరీర్‌లో అత్యధిక స్కోరును నమోదు చేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో మొత్తం 11 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. గతంలో లిస్ట్-ఏ క్రికెట్‌లో హార్దిక్ అత్యధిక స్కోరు 92 పరుగులు కాగా, ఇవాళ దాన్ని అధిగమించి సెంచరీ మార్కును అందుకున్నాడు. హార్దిక్ మెరుపులతో బరోడా జట్టు నిర్ణీత ఓవర్లలో 270 పరుగులకు పైగా భారీ స్కోరు సాధించింది.
టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో హార్దిక్ పాండ్యా టీమిండియాకు అత్యంత కీలకం. గత కొంతకాలంగా ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమైన హార్దిక్, ఇప్పుడు ఇలాంటి ఫామ్‌లో ఉండటం భారత జట్టుకు పెద్ద సానుకూల అంశం. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ రాణిస్తే, భారత్‌కు తిరుగుండదని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. పాండ్యా పవర్‌ను చూసిన నెటిజన్లు ది మ్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
