Andhra News: ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా.. అరకు హాస్పిటల్ వాష్‌రూమ్‌లో..
అరకు ఏరియా ఆసుపత్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వాష్ రూమ్‌లో ఓ నవజాత శిశువును వదిలేసి వెళ్లారు కొందరు వ్యక్తులు. ఉదయాన్నే శానిటేషన్ సిబ్బంది గుర్తించగా, ఆసుపత్రి సూపరింటెండెంట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తూ, గర్భిణుల వివరాలు ఆరా తీస్తున్నారు. నిందితుల పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటన అరకు ప్రాంతంలో కలకలం రేపింది.

ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులోయలో అమానుష అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అరకు ఏరియా ఆసుపత్రిలో నవజాత శిశువు కలకలం రేపింది. ఉదయాన్నే శానిటేషన్ కోసం వెళ్ళిన సిబ్బంది.. వాష్ రూమ్‌లో ఉన్న శిశువును చూసి షాక్ అయ్యారు. వెంటనే హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు తెలియజేశారు. దీంతో శిశువును స్వాధీనం చేసుకున్న సిబ్బంది హాస్పిటల్‌లోకి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇక హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారంతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రితో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు పరిసిలిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణిల వివరాలు ఆరాపై తీస్తున్నారు. ఓపీ రిజిస్ట్రార్ లో నమోదైన.. గర్భిణీల వివరాలపై కూపీ లాగుతున్నారు.
అయితే గత రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఒపీ కోసంమని కొందరు వ్యక్తులు వచ్చారని.. వారు ఉదయం 8:30 ప్రాంతంలో హాస్పిటల్ నుంచి తిరిగి వెళ్ళిపోయారని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. వాష్ రూమ్ కూడా వాళ్లే ఎక్కువగా వినియోగించుకున్నట్టు తమ పరిశీలనలో తేలిట్టు చెప్పారు. వాష్‌రూమ్‌లో శిశువును వారే వదిలి వెళ్లి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు వచ్చివెళ్లిన సి సి ఫుటేజీని పోలీసులకు అప్పగించాంమని.. వాళ్లను పట్టుకునే పనిలోనే పోలీసులు ఉన్నట్టు అరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాము తెలిపారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
