Vastu Tips: ఇంట్లో ఈ స్థలంలో డబ్బు ఉంచితే కష్టాలు తప్పవు!
వాస్తు శాస్త్రం అనేది అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని హిందూమతంలో విశ్వసిస్తారు. సంపాదించిన డబ్బు నిలవకపోవడానికి కూడా ఒక కారణం ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అనుకోని ఆర్థిక ఇబ్బందులు, అప్పులు పెరిగిపోవడం అనేవి వాస్తు దోషాల వల్లే జరుగుతాయని చెబుతోంది. వాటిని సరిచేస్తే సానుకూలంగా సాగుతాయని స్పష్టం చేస్తోంది.

హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఉంది. చాలా మంది వాస్తశాస్త్రం ప్రకారమే తమ నివాసాలను నిర్మించుకుంటారు. వాస్తు అనేది అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని విశ్వసిస్తారు. సంపాదించిన డబ్బు నిలవకపోవడానికి కూడా ఒక కారణం ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అనుకోని ఆర్థిక ఇబ్బందులు, అప్పులు పెరిగిపోవడం అనేవి వాస్తు దోషాల వల్లే జరుగుతాయని చెబుతోంది. వాటిని సరిచేస్తే సానుకూలంగా సాగుతాయని పేర్కొంటుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కొన్ని ప్రదేశాలలో డబ్బు ఉంచుకోవద్దు. అలాంటి ప్రదేశాలలో డబ్బు ఉంచితే.. అది మీ చేతుల్లో ఎప్పుడూ ఉండదు. అది ఖర్చవుతుంది. ఇంట్లో శ్రేయస్సు ఉండదు. మీరు ఆర్థికంగా అస్థిరంగా మారతారు. కాబట్టి శాస్త్రం ఖచ్చితంగా ఏమి చెబుతుందో ఆయా సూచనలు పాటిస్తే సరిపోతుంది. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తుశాస్త్రం ప్రకారం.. ఎప్పుడూ టాయిలెట్ లేదా బాత్రూమ్ పక్కన ఉన్న గోడకు ఉండే సెల్ఫ్‌లో డబ్బు పెట్టకూడదు. దీని వల్ల డబ్బు ఖర్చవుతుంది. డబ్బు చేతుల్లో ఎక్కువ కాలం ఉండదు. ఇంట్లో ఆకస్మాత్తుగా ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతాయి. అందువల్ల ఇంటి సేఫ్‌ను ఎప్పుడూ టాయిలెట్ లేదా బాత్రూమ్ గోడ పక్కన ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి సేఫ్ ఒక మూలలో లేదా చీకటి ప్రదేశంలో ఉండకూడదు. దీని వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. వచ్చిన ఖర్చు అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో, ఆ ఇంటికి ఎప్పుడూ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి మన ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
Note: ఈ వార్తలో ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. TV9 దీనిని ధృవీకరించదు.
