AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: షారుక్‌ పక్కన ఉన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.. ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే

ఈ స్టార్ బాలీవుడ్ హీరోయిన్‌కు చిన్ననాటి నుంచి సినిమాలతోపాటు క్రికెట్‌పైనా ఆసక్తి నెలకొంది. ఈ ఆసక్తితో ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోలైన షారుక్ ఖాన్, హ‌ృతిక్ రోషన్‌తోపాటు మరికొందరు ఆటగాళ్లతోపాటు స్టేడియానికి చేరుకుంది. ఐపీఎల్ 2012 ఫైనల్ సందర్భంగా ఈ చిన్నారి సందడి చేసింది.

IPL 2025: షారుక్‌ పక్కన ఉన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.. ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే
Ipl 2012 Kkr Team
Venkata Chari
|

Updated on: Apr 05, 2025 | 7:27 PM

Share

క్రికెటర్లకు, సినీ తారలకు మధ్య ప్రత్యేక సంబంధం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఈవెంట్లలో క్రికెటర్లు, స్టేడియాల్లో సినీతారలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఒరవడి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు కారణం, ఇండియాన్ ప్రీమియర్ లీగ్. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతోంది. తమ ఇష్టమైన జట్లు, ఆటగాళ్లను చూసేందుకు స్టేడియాలకు చేరుకుంటున్నారు. ఎక్కడ మ్యాచ్ జరిగినా అభిమానులతో స్టేడియాలు ఫుల్ ప్యాక్ అవుతున్నాయి. అయితే, మ్యాచ్‌లు చూసేందుకు ఫ్యాన్స్‌తోపాటు సినిమా సెలబ్రెటీలు కూడా అప్పుడప్పుడు వస్తున్నారు. ఇందులో టాలీవుడ్ నుంచి కోలీవుడ్, బాలీవుడ్ వరకు ఇలా స్టార్స్ కూడా క్రికెట్‌పై ఆసక్తి చూపిస్తూ మైదానాలకు చేరుకుంటున్నారు. అయితే, తాజాగా ఓ ఐపీఎల్ 18వ సీజన్‌లో ఓ లేడీ సెలబ్రిటీ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈమె చిన్నప్పటి నుంచి ఐపీఎల్‌కు ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఓ అభిమానిలా మారిపోయింది. దీంతో ఐపీఎల్ ఓపెనింగ్‌లో సందడి చేయడమే కాదు పలు మ్యాచ్‌లు చూసేందుకు స్డేడియంలోనూ సందడి చేస్తోంది.

ఈ స్టార్ బాలీవుడ్ హీరోయిన్‌కు చిన్ననాటి నుంచి సినిమాలతోపాటు క్రికెట్‌పైనా ఆసక్తి నెలకొంది. ఈ ఆసక్తితో ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోలైన షారుక్ ఖాన్, హ‌ృతిక్ రోషన్‌తోపాటు మరికొందరు ఆటగాళ్లతోపాటు స్టేడియానికి చేరుకుంది. ఐపీఎల్ 2012 ఫైనల్ సందర్భంగా ఈ చిన్నారి సందడి చేసింది. ఆనాడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నైని ఓడించిన కోల్‌కతా ట్రోఫీని గెలుచుకుంది. అయితే, అప్పుడు ఈ చిన్నారి ఎవరో అంతగా తెలియదు. అయితే, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. సోషల్ మీడియాలోనూ అత్యధిక ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. తన అందంతోపాటు నటనతోనూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ బ్యూటీ తెలుగులోనూ నటించింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా, ఈ బ్యూటీ తొలి తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మరి ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

1998 అక్టోబర్ 30న ముంబైలో జన్మించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా మారిపోయింది. అనన్య పాండే తండ్రి కూడా బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు, తల్లి ఒక కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తోంది. 2012లో ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌లో సందడి చేసిన అనన్య పాండే.. 2019లో “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2” చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తన తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకపోతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీకి భారీ ఫాలోయింగ్ ఉంది. తన నటనతోనే కాదు ఫ్యాషన్‌తోనూ పాపులర్‌ అయ్యింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..