Virat Kohli : కోహ్లీ..కోహ్లీ నినాదాలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్టు..కింగ్‌కి అనుష్క అంటే ఎంత ఇష్టమో చూపించాడుగా
Virat Kohli : విరాట్ కోహ్లీ తన కారు వైపు వెళ్తుండగా ఫ్యాన్స్ సెల్ఫీల కోసం, కనీసం ఒక్కసారైనా ఆయన్ని తాకాలని ఎగబడ్డారు. దీంతో రక్షణగా ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ని సురక్షితంగా కారు వరకు తీసుకెళ్లడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒక్క దశలో జనాన్ని అదుపు చేయడం కష్టమవ్వడంతో విరాట్ కూడా కొంచెం అసహనానికి గురైనట్లు కనిపించింది.

Virat Kohli : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుధవారం సాయంత్రం న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం కోహ్లీ వడోదర ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. అయితే ఆయన వస్తున్నారనే విషయం తెలుసుకున్న వేలాది మంది అభిమానులు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విరాట్ బయటకు రాగానే ఒక్కసారిగా ‘కోహ్లీ.. కోహ్లీ..’ అనే నినాదాలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం మారుమోగిపోయింది. అభిమానులు ఒక్కసారిగా విరాట్‌ను చుట్టుముట్టడంతో పరిస్థితి కాస్త గందరగోళంగా మారింది.
విరాట్ కోహ్లీ తన కారు వైపు వెళ్తుండగా ఫ్యాన్స్ సెల్ఫీల కోసం, కనీసం ఒక్కసారైనా ఆయన్ని తాకాలని ఎగబడ్డారు. దీంతో రక్షణగా ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ని సురక్షితంగా కారు వరకు తీసుకెళ్లడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒక్క దశలో జనాన్ని అదుపు చేయడం కష్టమవ్వడంతో విరాట్ కూడా కొంచెం అసహనానికి గురైనట్లు కనిపించింది. అయినా సరే, ఓపికగా నవ్వుతూ కొందరు అభిమానులతో ఫోటోలకు పోజులిచ్చి అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
గత కొన్ని నెలలుగా విరాట్ కోహ్లీ భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతూ రెండు మ్యాచ్‌ల్లో 131 మరియు 77 పరుగులు చేసి సత్తా చాటారు. అంతకుముందు సౌతాఫ్రికా సిరీస్‌లో కూడా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచారు. ఇప్పుడు కివీస్‌తో జరగబోయే వన్డేల్లో కూడా కోహ్లీ తన బ్యాట్ పవర్ చూపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. న్యూజిలాండ్‌పై కోహ్లీకి అత్యుత్తమ రికార్డు ఉంది, అందుకే ఈ వన్డే సిరీస్ కోహ్లీ ఫ్యాన్స్‌కు పండగలా మారనుంది.
#WATCH | Gujarat: Former Indian Captain and Star Cricketer Virat Kohli arrives at Vadodara for Team India's ODI match against New Zealand on 11th January. pic.twitter.com/cQbhCghMZy
— ANI (@ANI) January 7, 2026
కోహ్లీ వడోదర వస్తున్నప్పుడు ధరించిన దుస్తులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన నలుపు రంగు స్వెటర్ ధరించారు. దానిపై ఎడమ వైపున ఎరుపు రంగులో ఒక గుండె గుర్తు, దాని కింద ఇంగ్లీష్ అక్షరం A ఉంది. ఇది చూసిన అభిమానులు అది కచ్చితంగా తన భార్య అనుష్క శర్మ పేరులోని మొదటి అక్షరమేనని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. తన భార్యపై కోహ్లీకి ఉన్న ప్రేమను ఇలా చాటుకున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
