DC vs RR, IPL 2024: సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం

Delhi Capitals Vs Rajasthan Royals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మంగళవారం ( మే 07) రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

DC vs RR, IPL 2024: సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
Delhi Capitals Vs Rajasthan
Follow us

|

Updated on: May 08, 2024 | 12:01 AM

Delhi Capitals Vs Rajasthan Royals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మంగళవారం ( మే 07) రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదింఛేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ బ్యాటర్లలో సంజూ శాంసన్ 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అయితే మిగతా బ్యాటర్లు పెద్దగా స్కోర్లు చేయకపోవడంతో రాజస్థాన్ కు పరాజయం తప్పలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఖలీల్‌ అహ్మద్‌ 2, ముఖేష్‌ కుమార్‌ 2, కుల్‌దీప్‌ యాదవ్‌ 2, అక్షర్‌ పటేల్‌, రసిఖ్‌ దార్‌ సలామ్‌ తలో వికెట్‌ తీశారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 12 పాయింట్లతో 5వ స్థానానికి ఎగబాకింది. అలాగే ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడంలో రిషబ్ పంత్ జట్టు సఫలమైంది.

పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి..

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్  అండ్ వికెట్ కీపర్ ), రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్  ప్లేయర్లు:

జోస్ బట్లర్, కుల్దీప్ సేన్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, తనుష్ కోటియన్, కునాల్ సింగ్ రాథోర్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్  అండ్ వికెట్ కీపర్ ), ట్రిస్టన్ స్టబ్స్, గుల్బాదిన్ నాయబ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

ఇంపాక్ట్  ప్లేయర్లు:

రసిఖ్ దార్ సలామ్, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్, సుమిత్ కుమార్, కుమార్ కుషాగ్రా

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్