Hyderabad: అయ్యో.. ఈ రోజు హైదరాబాద్‌ మ్యాచ్ కష్టమే.. ఇదిగో వెదర్ రిపోర్ట్

హైదరాబాద్‌, లక్నో మధ్య జరిగే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ చాలా కీలకమైన వేళ... వర్షం పడుతుందనే భయం ఇరు జట్ల అభిమానులను కలవరపెడుతోంది. మ్యాచ్ ప్రారంభమయ్యాక వర్షం వల్ల అంతరాయం ఏర్పడితే ఓవర్లను తగ్గిస్తారు. వాన తగ్గాక సమయం ఉంటే కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిస్తారు.

Hyderabad: అయ్యో.. ఈ రోజు హైదరాబాద్‌ మ్యాచ్ కష్టమే.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Uppal Stadium
Follow us

|

Updated on: May 08, 2024 | 1:41 PM

ఈరోజు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్ ప్రకారం, నగరంలో ఈరోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం కూడా నగరంలో వర్షం కురిసింది.

SRH vs LSG మధ్య IPL మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు షెడ్యూల్ చేయబడింది. మ్యాచ్ కోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.  చాలా మంది హైదరాబాదీలు SRH హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్నప్పుడు చూడాలని ఆత్రంగా టికెట్లు కొనుక్కున్నారు. వాతావరణ శాఖ చెప్పిన న్యూస్‌తో వారంతా దిగులు చెందుతున్నారు. కాగా, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మంగళవారం కురిసిన వర్షాలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

హైదరాబాద్ టీమ్ ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడి.. 6 మ్యాచుల్లో గెలిచి.. 5 మ్యాచుల్లో ఓడిపోయింది. ప్రస్తుతం టీమ్ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. లక్నో కూడా ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడి.. 6 మ్యాచుల్లో గెలిచి.. 5 మ్యాచుల్లో ఓడిపోయింది. వీరి ఖాతాలో కూడా 12 పాయింట్లు ఉన్నాయి. అయితే లక్నోతో పోలిస్తే.. హైదరాబాద్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది.

బుధవారం మ్యాచ్‌కు ఇరు జట్ల  స్క్వాడ్స్ :

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (w), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (C), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిప్స్ , జయదేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్, ఐడెన్ మర్క్రామ్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, ఝటవేద్ సుబ్రమణ్యన్, విజయకాంత్ వియాస్కాంత్, ఫజల్హాక్ ఫరూఖీ, ఆకాష్ మహరాజ్ సింగ్

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (w/c), అర్షిన్ కులకర్ణి, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, అష్టన్ టర్నర్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్ చరక్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, మొహ్స్ ఖాన్, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, దేవదత్ పడిక్కల్, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, క్వింటన్ డి కాక్, మాట్ హెన్రీ, ప్రేరక్ మన్కడ్, అర్షద్ ఖాన్, షమర్ జోసెఫ్

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..