Sydney ODI : సిడ్నీ వన్డేలో అంపైర్లు చేతికి పెట్టుకుంది ఏంటో చూశారా ? దీనిని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా ?
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో టీమిండియా ఓడిపోయింది. దీంతో 0-2తో సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయింది. ఇప్పుడు చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా తన పరువు నిలుపుకోవడానికి పోరాడబోతుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే మ్యాచులో గెలిచి క్లీన్ స్వీప్‌ను అడ్డుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.

Sydney ODI : క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది. టెస్ట్ క్రికెట్ నుంచి 60 ఓవర్లు, ఆ తర్వాత 50 ఓవర్లు.. ఇప్పుడు ఊహించని విధంగా టీ20, టీ10 ఫార్మాట్‌లు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఆట ఫార్మాట్ మాత్రమే కాదు, దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఎంతో మారింది. ముఖ్యంగా మైదానంలో నిలబడే అంపైర్లు ఉపయోగించే పరికరాలు ఎంతో అడ్వాన్సుడ్ అయ్యాయి. గతంలో మార్బుల్స్ ఉపయోగించి బంతులను లెక్కించేవారు. కానీ ఇప్పుడు అంపైర్లకు బౌలర్ వేగం నుంచి బ్యాట్ అంచుకు తాకిన బంతిని కనిపెట్టే అడ్వాన్సుడ్ టెక్నాలజీ వరకు ఎన్నో పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో టీమిండియా ఓడిపోయింది. దీంతో 0-2తో సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయింది. ఇప్పుడు చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా తన పరువు నిలుపుకోవడానికి పోరాడబోతుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే మ్యాచులో గెలిచి క్లీన్ స్వీప్‌ను అడ్డుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ జరుగుతుండగా చాలా మంది దృష్టి అంపైర్ల చేతికి ఉన్న వస్తువుల మీద పడింది. అసలేంటి ఇది అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. అసలు అంపైర్లు మ్యాచు జరుగుతుండగా ఉపయోగించే ఐదు ముఖ్యమైన పరికరాల గురించి తెలుసుకుందాం.
1. స్నికో మీటర్
స్నికో-మీటర్ అనేది క్రికెట్‌లో ఒక ముఖ్యమైన టెక్నాలజీ. అంపైర్లు డీఆర్‌ఎస్ సమయంలో దీనిని తరచుగా ఉపయోగిస్తారు. బ్యాట్ లేదా ప్యాడ్‌ను బంతి దాటే సమయంలో వచ్చే శబ్దంలోని మార్పులను ఇది గుర్తిస్తుంది. వికెట్ నిర్ణయాన్ని మెరుగుపరచడానికి, బ్యాటర్ ఔటా కాదా అని అంపైర్లు స్నికో-మీటర్‌ను పరిశీలిస్తారు. ఇది ప్రాథమికంగా డైరెక్షనల్ మైక్రోఫోన్‌లను ఉపయోగిస్తుంది. ఇవి బ్యాట్ లేదా ప్యాడ్ నుండి వచ్చే శబ్దాన్ని ఉపయోగించి బంతి తాకినట్లు సూచిస్తాయి.
2. బాల్ గేజ్
క్రికెట్ నిబంధనల ప్రకారం బంతికి నిర్దిష్ట పరిమాణం ఉండాలి. దీనిని నిర్ధారించడానికి బాల్ గేజ్‌ను ఉపయోగిస్తారు. అంపైర్లు బంతి పరిమాణం సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయడానికి బాల్ గేజ్‌ను ఉపయోగిస్తారు. ఆటగాళ్లు బంతిని గట్టిగా కొట్టినప్పుడు దాని ఆకారం మారడం సర్వసాధారణం. బంతి పరిమాణంలో ఏదైనా మార్పు ఉందని అంపైర్లు భావిస్తే, వెంటనే బంతిని మార్చుతారు.
3. కౌంటర్
కౌంటర్ అనేది ఒక ఓవర్‌లో వేసిన బంతుల సంఖ్యను లెక్కించడానికి అంపైర్లు ఉపయోగించే చిన్న పరికరం. బంతిని వేసిన వెంటనే, అంపైర్లు ఈ పరికరంలోని బటన్‌లను నొక్కడం ద్వారా ఓవర్‌లో వేసిన బంతుల సంఖ్యను సూచిస్తారు. గతంలో అంపైర్లు ఒక చేతిలో మార్బుల్స్ పట్టుకుని, ప్రతి బంతి వేసిన తర్వాత వాటిని ఇంకో చేతిలోకి మార్చుతూ బంతులను లెక్కించేవారు. కానీ ఇప్పుడు ఈ కౌంటర్ అంపైర్ పనిని సులభతరం చేసింది.
4. వాకీ-టాకీ
వాకీ-టాకీలను మైదానంలోని అంపైర్లు, లోపల కూర్చున్న థర్డ్ అంపైర్‌తో సంభాషించడానికి ఉపయోగిస్తారు. డీఆర్‌ఎస్, క్లిష్టమైన నిర్ణయాల సమయంలో ఆన్-ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సహాయం తీసుకుంటారు. ఈ సమయంలో వాకీ-టాకీ ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఇద్దరు అంపైర్లు నిరంతరం సంప్రదించుకుంటూ సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తారు.
5. ప్రొటెక్టివ్ షీల్డ్
ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో బ్యాటర్లు దూకుడుగా ఆడటం, బంతిని గట్టిగా కొట్టడం ఎక్కువైంది. ఈ సమయంలో అంపైర్ల రక్షణ కోసం దీనిని ఉపయోగిస్తారు. బంతి నేరుగా తమ వైపు దూసుకు వచ్చినప్పుడు గాయాలు కాకుండా రక్షించుకోవడానికి అంపైర్లు తమ చేతిపై ఈ ప్రొటెక్టివ్ షీల్డ్‌ను ధరిస్తారు. ముఖ్యంగా ఐపీఎల్ వంటి టీ20 లీగ్‌లలో, బ్యాటర్ల పవర్ఫుల్ షాట్ల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఈ ప్రొటెక్టివ్ షీల్డ్ అంపైర్లకు చాలా ఉపయోగపడుతుంది. ఇదే సిడ్నీ మ్యాచులో అంపైర్లు తమ చేతులకు పెట్టుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




