Liam Livingstone IPL Auction 2026: వేలంలో పవర్ హిట్టర్ను పట్టించుకోని ఫ్రాంచైజీలు.. రూ.13కోట్లతో తన జట్టులో చేర్చుకున్న SRH
Liam Livingstone IPL 2026 Auction Price: సన్‌రైజర్స్ హైదరాబాద్ లియామ్ లివింగ్‌స్టోన్ ను భారీ ధరకు కొనుగోలు చేసి తమ జట్టులోకి తీసుకుంది. వేలంలో మొదటి రౌండ్‌లో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో లివింగ్‌స్టోన్ ఉన్నప్పటికీ, చివరి రౌండ్‌లో SRH అతన్ని తమ జట్టులోకి తీసుకోవడానికి గట్టిగా నిర్ణయించుకుంది.

Liam Livingstone IPL Auction 2026: ఆధునిక టీ20 క్రికెట్‌లో అత్యంత విధ్వంసకర బ్యాటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఇంగ్లాండ్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ ను కొనుగోలు చేయడానికి ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌లో ఏ ఫ్రాంచైజీ కూడా చివరిదాకా మొగ్గు చూపకపోవడం అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. అతని కోసం 7 కోట్ల బిడ్లు దాటినా, తుది బిడ్ లేకపోవడంతో లివింగ్‌స్టోన్ అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయాడు.
ఆక్షన్‌లో బిడ్డింగ్ డ్రామా లివింగ్‌స్టోన్ వేలానికి వచ్చినప్పుడు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అతని కోసం ఆసక్తి చూపింది. లక్నో బిడ్డింగ్‌ను ఏకంగా 7 కోట్ల మార్కు వరకు దూకుడుగా పెంచింది. ఈ దశలో లివింగ్‌స్టోన్ భారీ ధరకు అమ్ముడుపోతాడని అందరూ భావించారు. అయితే, బిడ్డింగ్ ప్రక్రియ చివరి దశలో లేదా తదుపరి రౌండ్‌లలో, ఏ ఫ్రాంచైజీ కూడా తుది బిడ్‌ను నమోదు చేయలేదు. అతనిపై భారీ మొత్తాన్ని ఖర్చు చేయడానికి జట్లు వెనుకడుగు వేశాయి.
తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ లియామ్ లివింగ్‌స్టోన్ ను భారీ ధరకు కొనుగోలు చేసి తమ జట్టులోకి తీసుకుంది. వేలంలో మొదటి రౌండ్‌లో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో లివింగ్‌స్టోన్ ఉన్నప్పటికీ, చివరి రౌండ్‌లో SRH అతన్ని తమ జట్టులోకి తీసుకోవడానికి గట్టిగా నిర్ణయించుకుంది. రూ.13 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి, తమ మిడిల్ ఆర్డర్‌కు అవసరమైన విధ్వంసకర బ్యాటింగ్, పార్ట్-టైమ్ స్పిన్ సామర్థ్యాన్ని జోడించుకుంది. ఈ కొనుగోలుతో SRH బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారింది.
గతంలో 8.75 కోట్లు దక్కించుకున్న స్టార్ ఆటగాడికి ఈ నిరాశ ఎదురవడం ఈ ఆక్షన్‌లో పెద్ద ట్విస్ట్. 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 10 మ్యాచ్‌ల్లో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి అంచనాలను అందుకోలేకపోవడంతో, ఆర్సీబీ అతన్ని ఈ సీజన్‌కు ముందు విడుదల చేసింది. ఈ పేలవమైన ఫామే వేలంలో అతనికి ప్రతికూలంగా మారింది.
లివింగ్‌స్టోన్ కెరీర్ ప్రస్థానం లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్‌లో ప్రయాణం అంచనాలు, నిరాశల మధ్య సాగింది. అతను తన ఐపీఎల్ ప్రయాణాన్ని 2019లో 50 లక్షల బేస్ ప్రైస్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ప్రారంభించాడు. 2021లో తిరిగి రాజస్థాన్‌లో చేరినా, బయో-బబుల్ అలసట కారణంగా టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. అతని కెరీర్‌లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ 2022 మెగా వేలం. ఆ వేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని భారీగా పోటీపడి 11.50 కోట్లకు కొనుగోలు చేసింది. 2022 సీజన్ అతని కెరీర్‌లో అత్యుత్తమం, ఇందులో 182 పైగా స్ట్రైక్ రేట్‌తో 437 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌పై 117 మీటర్ల భారీ సిక్సర్ కొట్టడం ఆ సీజన్ హైలైట్. 2025లో 8.75 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని దక్కించుకున్నా, అక్కడ మాత్రం 10 మ్యాచ్‌ల్లో 112 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
లివింగ్‌స్టోన్ కేవలం భారీ సిక్సర్లు కొట్టే బ్యాటర్ మాత్రమే కాదు, తన ప్రత్యేకమైన బౌలింగ్‌తో కూడా జట్టుకు ఉపయోగపడతాడు. అతను క్రీజులో నిలదొక్కుకుంటే బౌలర్లకు దడ పుట్టిస్తాడు, అతని కెరీర్ స్ట్రైక్ రేట్ 158.76 వద్ద ఉండటం అతని దూకుడుకు నిదర్శనం. అతని ఐపీఎల్ కెరీర్ అత్యధిక స్కోరు ఢిల్లీ క్యాపిటల్స్‌పై చేసిన 94 పరుగులు. ముఖ్యంగా, అతను ఒకే ఓవర్‌లో రెండు రకాలుగా బౌలింగ్ చేయగల అరుదైన సామర్థ్యం ఉన్నవాడు. కుడిచేతి వాటం బ్యాటర్లకు లెగ్ స్పిన్, ఎడమచేతి వాటం బ్యాటర్లకు ఆఫ్ స్పిన్ వేయగలడు. లివింగ్‌స్టోన్ ఒక మ్యాచ్ విన్నర్ అనడంలో సందేహం లేదు, కానీ ఇటీవల ఫామ్ లేమి అతన్ని దెబ్బతీసింది. అయినప్పటికీ, భవిష్యత్తులో జరిగే వేలంలో అతని ఆల్‌రౌండర్ సామర్థ్యంపై ఏదైనా ఫ్రాంచైజీ మళ్లీ ఆసక్తి చూపితే ఆశ్చర్యపోనవసరం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




