Video: ఆస్ట్రేలియాలో ఉబర్ బుక్ చేసుకున్న టీమిండియా క్రికెటర్లు! ఎక్కడికి వెళ్లారు? ఎవరెవరు వెళ్లారంటే?
టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో రెండు వన్డేలు ఓడిపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ టెన్షన్ మధ్య, యువ భారత క్రికెటర్లు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణ అడిలైడ్‌లో ఉబర్‌లో షికారు చేశారు. డ్రైవర్ వారిని గుర్తించలేదు. ఈ వీడియో వైరల్ కాగా, జట్టు కష్టాల్లో ఉన్నా యువ ఆటగాళ్లు సరదాగా గడిపారు.

ప్రస్తుతం టీమిండియా ఆసీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌తో పాటు టీ20 సిరీస్ కూడా ఆడనుంది భారత జట్టు. ఇప్పటికే రెండు వన్డేల పూర్తి కాగా నేడు(శనివారం) చివరిదైన మూడో వన్డే జరగనుంది. తొలి రెండు వన్డేల్లో ఓడిన టీమిండియా, కనీసం చివరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. అయితే ఇలా ఒకవైపు మ్యాచ్‌ల టెన్షన్ ఉంటే.. మరోవైపు టీమిండియా యంగ్ క్రికెటర్లు ప్రైవేట్ ట్యాక్సీలో షికారుకి వెళ్లారు. వాళ్లే స్వయంగా ఉబర్ బుక్ చేసుకొని మరీ వెళ్లారు. ఇంతకీ ఎవరు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారనేది ఇప్పుడు చూద్దాం..
ముగ్గురు యువ భారత క్రికెటర్లు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణ అడిలైడ్ సిటీలో ఉబర్ బుక్ చేసుకొని ప్రయాణించారు. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ వీరిని గుర్తుపట్టలేదు. ప్రస్తుతం ఈ రైడ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రసిద్ధ్ కృష్ణ ముందు సీటులో కూర్చున్నాడు, జైస్వాల్, జురెల్ వెనుక సీటులో కూర్చున్నారు. అయితే క్రికెటర్లు ఎక్కడికి వెళ్లారనే విషయం మాత్రం తెలియరాలేదు. సరదాగా సిటీలో తిరుగుతూ షాపింగ్ చేయడానికి వెళ్లి ఉంటారని తెలుస్తోంది.
టీమిండియా క్రికెటర్లు కారులో చాలా ఉత్సాహంగా కనిపించినా.. జట్టు పరిస్థితి మాత్రం అంత బాగా లేదు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు, కానీ అదృష్టం వారికి అనుకూలంగా లేదు. కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. అయితే తొలి వన్డేలో రోహిత్ 8 పరుగులే చేసినా.. రెండో వన్డేలో 73 పరుగులతో అద్భుతంగా రాణించాడు. కనీసం మూడో వన్డేలో అయినా టీమిండియా గెలవాలని, కోహ్లీ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Jaisu, Jurel and Prasidh in an Uber ride in Adelaide 🇦🇺 pic.twitter.com/c3FuVP9PeN
— Wren (@vyomanaut02) October 22, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




