AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidura Niti: ఈ లక్షణాలు మీకు ఉంటే జీవితంలో సక్సెస్ మీ సొంతం.. అవి ఏమిటంటే..

జీవితంలో విజయం సాధించడానికి ప్రతి ఒక్కరికీ కొన్ని లక్షణాలు ఉండాలి. పుట్టిన ప్రతి వ్యక్తికి ఏదో ఒకటి సాధించాలనే కోరిక ఉండాలని.. అందరిలాగా ఉండకూడదని విదురుడు చెబుతున్నాడు. కొంతమంది జీవితంలో విజయం సాధించడానికి తమ సొంత మార్గాన్ని ఎంచుకుంటారు. జీవితంలో విజయం సాధిస్తారు. ఇతరులకు ఆదర్శంగా మారతారు. అయితే ఎవరికైనా జీవితంలో గెలవాలంటే కొన్ని లక్షణాలుండాలి. కనుక విదురుడు తన నీతిశాస్త్రంలో ఆ లక్షణాలను ప్రస్తావించాడు. వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం..

Vidura Niti: ఈ లక్షణాలు మీకు ఉంటే జీవితంలో సక్సెస్ మీ సొంతం.. అవి ఏమిటంటే..
Vidura Neeti In TeluguImage Credit source: social media
Surya Kala
| Edited By: Ram Naramaneni|

Updated on: Mar 09, 2025 | 7:54 PM

Share

ప్రతి ఒక్కరూ విజయాన్ని కోరుకుంటారు. జీవితంలో తాము అనుకున్నది సాధించాలని భావిస్తారు. జీవితాంతం తమ విజయం కోసం పోరాడుతూనే ఉంటాడు. ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో విజయాన్ని సాధించాలని భావిస్తారు. అయితే విదురుడు ప్రతి మనిషి కొన్ని లక్షణాలను అలవర్చుకుంటే.. విజయం మీదే అవుతుందని పేర్కొన్నారు. జీవిత యుద్ధాన్ని సులభంగా గెలవవచ్చని ఆయన అన్నారు.

  1. ఈ వ్యక్తులను మాత్రమే నమ్మండి: నమ్మకాన్ని సంపాదించడం చాలా కష్టం. అయితే అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఒక వ్యక్తి నమ్మదగిన వ్యక్తో.. నమ్మదగినవాడో కాడో తెలుసుకోవాలి.. వ్యక్తులను నమ్మే ముందు.. ఎవరికైనా చెప్పే ముందు వందసార్లు ఆలోచించడం చాలా ముఖ్యం. కనుక జీవితంలో గెలవాలంటే..నమ్మకమైన వారినే నమ్మండి అని విదురుడు సలహా ఇచ్చాడు.
  2. ఈ మూడు విషయాలకు దూరంగా ఉండండి: విజయం సాధించడానికి ఈ మూడు విషయాలకు దూరంగా ఉండాలని విదురుడు చెప్పాడు. కామం, కోపం, దురాశ అనేవి ఒక వ్యక్తిని ఓటమి నుంచి దూరంగా ఉంచే మూడు అంశాలు. కనుక వ్యక్తీ జీవితంలో ఈ మూడింటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే మంచిది.
  3. చెడు పనులు చేయవద్దు: మంచి పనులు చేసి, చెడు పనులకు దూరంగా ఉండే వ్యక్తిని సద్గురువు అంటారు. అంతేకాదు చెడు పని విజయ మార్గాన్ని అడ్డుకుంటుంది. కనుక మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ మంచి చేయడానికి .. ఇతరులకు మంచిని కోరుకోవడానికి ప్రేరేపించుకోండి.
  4. సమాన ఆమోదం: మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ప్రశంసిస్తే అతిగా సంతోషించకండి. గొప్పగా చెప్పుకోకండి. ఎవరైనా మిమ్మల్ని బాధపెడితే లేదా అవమానిస్తే సిగ్గుపడకండి. రెండింటినీ సమానంగా స్వీకరించే గుణం ఒక వ్యక్తిని విజయ శిఖరానికి తీసుకెళుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. కష్టపడి, ఇష్టంగా పని చేయండి: ఒక పనిని పూర్తి చేయాలి తప్పదు కనుక అంటూ పనిని చేయవద్దు. అది విజయాన్ని తెచ్చిపెట్టదు. ఇష్ట పడకుండా, కోరుకుండా ఏదైనా పని చేస్తే అది అసంపూర్ణంగా మారి, సగంలోనే ఆగిపోవచ్చు. అందువలన పని పూర్తి చేయాలంటూ మనస్పూర్తిగా కృషి చేయడం ఎల్లప్పుడూ మంచి ఫలితాలను తెస్తుంది.
  7. మనస్సును నియంత్రించే కళను నేర్చుకోండి: మీకు కోపంగా ఉన్నప్పుడు మనసు చెప్పేది ఎప్పుడూ వినకండి. నిర్ణయం తీసుకోవద్దు. జీవితంలో విజయం సాధించాలంటే మనస్సును ఎలా నియంత్రించాలో తెలుసుకోవాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న పనిని పూర్తి చేయగలరు. కనుక మనస్సును ఎలా నియంత్రించుకోవాలో తెలిసిన వ్యక్తి ఎప్పుడూ విజయం వైపు అడుగులు వేస్తాడు.
  8. దాన గుణం కలిగి ఉండండి: విదురుడి ప్రకారం దాన గుణం మంచి లక్షణాలలో ఒకటి. బలవంతుడైనా ఇతరులను క్షమించే వ్యక్తి లేదా పేదరికంలో ఉండి కూడా ఇతరులకు దానం చేసే గుణం ఉన్న వ్యక్తి స్వర్గంలో నివసిస్తాడు. ఈ గుణం మీలో ఉంటే జీవితంలో గెలుస్తారు. కనుక విదురుడు దాన గుణాన్ని అలవర్చుకోవాలని చెబుతున్నాడు.
  9. అనారోగ్యం నుంచి దూరంగా ఉండండి: అనారోగ్యంతో ఉండటం వల్ల డబ్బు ఖర్చవుతుంది. కనుక సరైన చికిత్స పొందండి. ఆరోగ్యంగా ఉండండి. ఎటువంటి వ్యాధులు లేకుండా జీవించడం కూడా విజయంలో ఒక భాగం. మీరు ఆరోగ్యంగా ఉంటే.. మీరు అనుకున్నది సాధించగలరు. వ్యాధి నుంచి విముక్తి పొందడం కూడా విజయానికి దారితీస్తుంది.
  10. సోమరిపోతులకు సహాయం చేయవద్దు: మీ చుట్టూ సోమరి వ్యక్తులు ఉంటే.. వారికి సహాయం చేయవద్దు. వారికి డబ్బు ఇవ్వడం, సహాయం చేయడం వంటి పనులు చేయడం మంచి కంటే చెడు జరుగుతుంది. మీ సహాయంతో మంచి జరగదు సరికదా.. సోమరిపోతుల సహవాసం కూడా మిమ్మల్ని సోమరిగా చేస్తుంది. కనుక విదురుడు చెప్పినట్లు ఈ వ్యక్తులతో సహవాసం చేయవద్దు లేదా వారికి సహాయం చేయవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు