Swapna Shastra: కలలో ఇవి కనిపిస్తే మంచి రోజులు రానున్నాయని అర్ధం.. సుఖ సంతోషాలు ఇచ్చే శుభ కలలు ఏమిటంటే..
ప్రతి వ్యక్తి నిద్రపోతున్నప్పుడు రకరకాల కలలు కంటాడు. ఇలాంటి కలలు మనసులోని ఆలోచనలు, అనుభవాలు, భావోద్వేగాలకు ప్రతిబింబాలుగా పరిగణిస్తారు. అయితే ఇలాంటి కొన్ని కలలు ఒక వ్యక్తిని చాలా భయపెడతాయి. అదే సమయంలో చాలా సంతోషపరిచే కొన్ని కలలు కూడా ఉంటాయి. ఈ రోజు కొన్ని శుభ కలల గురించి.. ఆ కలలకు వెనుక ఉన్న అర్ధాన్ని వివరంగా ఈ రోజు తెలుసుకుందాం..

హిందూ మతంలో స్వప్న శాస్త్రం చాలా ముఖ్యమైనదిగా వర్ణించబడింది. స్వప్న శాస్త్రంలో కలలు, వాటి అర్థాల గురించి వివరంగా చెప్పబడింది. ప్రతి వ్యక్తి నిద్రపోతున్నప్పుడు ఏదో ఒక కల కంటాడు. ఈ కలలు శుభ, అశుభ సంకేతాలను సూచిస్తాయి. స్వప్న శాస్త్రం ద్వారా కలలలో వచ్చే శుభ, అశుభ సంకేతాలను తెలుసుకోవడం వలన ఆ వ్యక్తి సమీప భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండగలడు. అయితే ఈ రోజు జీవితంలో శుభ సంకేతాలను ఇచ్చే కలల గురించి, శుభ కలల గురించి వివరంగా తెలుసుకుందాం.
కలలో లక్ష్మీదేవి కనిపిస్తే
హిందూ మత గ్రంథాలలో లక్ష్మీ దేవిని సంపదకు దేవతగా భావిస్తారు. సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి జన్మించింది. ఎవరైనా తమ కలలో లక్ష్మీ దేవిని చూసినట్లయితే.. అది చాలా శుభప్రదమైన కల అని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. కలలో లక్ష్మీ దేవిని చూడటం అంటే ఆ వ్యక్తికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని అర్థం. అతనికి విపరీతమైన డబ్బులు వస్తాయి. లక్ష్మీదేవి ఆశీర్వదం లభిస్తుందని.. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని అర్ధం అట.
కలలో ఓంని చూస్తే
ఎవరికైనా కలలో ఓం కనిపిస్తే అది చాలా అదృష్టం అని లెక్క.. ఎందుకంటే ఎవరికోగానీ కలలో ఓం సులభంగా కనిపించదు. ఇటువంటి కల రావడం చాలా అరుదు. కలలో ఓం కనిపిస్తే వారు అదృష్టవంతులు అని .. పట్టిందల్లా బంగారం అవుతుందని అర్థం చేసుకోవాలి. కలలో ఓం కనిపించిన వ్యక్తి జీవితం ధన్యమవుతుందని స్వప్న శాస్త్రం పేర్కొంది.
కలలో చంద్రుడి కనిపిస్తే
ఎవరైనా కలలో చంద్రుడిని చూసినట్లయితే అది చాలా శుభప్రదమని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. ఎవరి కలలోనైనా అర్ధ చంద్రాకారంలో ఉన్న చూసినట్లయితే వారి బాధలు, కష్టాలు ముగియబోతున్నాయని స్వప్న శాస్త్రంలో పేర్కొంది. అంతేకాదు ఇంటిలో ఆనందం నెలకొంటుంది.
కలలో పాలుతాగుతున్నట్లు కనిపిస్తే
ఎవరి కలలోనైనా పాలు తాగుతున్నట్లు కనిపిస్తే అతనికి ఆర్థిక లాభం చేకూరుతుందని అర్థం చేసుకోవాలి. దీనితో పాటు అతని జీవితంలోని అప్పటి వరకూ ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో జీవిస్తారని స్వప్న శాస్త్రం పేర్కొంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు







