- Telugu News Photo Gallery Spiritual photos Holi 2025: People come to these Holi destinations from India and world to celebrate it
Holi 2025: ఈ ప్రదేశాల్లో హోలీ వెరీ వెరీ స్పెషల్.. వేడుకలను చూసేందుకు విదేశీయులు కూడా క్యూ..
భారతదేశంలో హోలీ పండగను కుల మతాలకు అతీతంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అనేక ప్రదేశాల్లో హోలీ వేడుకలను చూడటానికి మన దేశం నుంచి మాత్రమే కాదు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. దేశ విదేశాలలో హోలీ ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రసిద్ధ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో జరిగే హోలీ వేడుకలను జీవితంలో ఒక్కసారైనా చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ రోజు ఆ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
Updated on: Mar 04, 2025 | 12:48 PM

దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. రంగుల కేళి హోలీ రోజున రంగులు ప్రతిచోటా చెల్లాచెదురుగా కనిపిస్తాయి. ఈ రోజున ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని ఆలింగనం చేసుకుంటారు. హోలీ పండుగ మానవులంతా ఒకటే.. ఎటువంటి తేడాలు లేవని చాటి చెబుతూ మానవుల మధ్య ఉన్న ఐక్యతను తెలియజేస్తూ సందేశాన్ని ఇస్తుంది. భారతదేశంలోని వివిధ నగరాల్లో హోలీని వివిధ రకాలుగా ఆడతారు. ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా హోలీ ప్రసిద్ధి చెందిన భారతదేశంలోని ఆ నగరాల గురించి తెలుసుకుందాం.. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు హోలీని చూడటానికి భారతదేశంలోని ఈ నగరాలకు వస్తారు.

ఈ ఏడాది హోలీ ఎప్పుడంటే ..హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి మార్చి 13, 2025న ఉదయం 10:35 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మార్చి 14న 12:23న ముగుస్తుంది. మార్చి 13న హోలికా దహనం చేయనున్నారు. మర్నాడు అంటే మార్చి 14న హోలీ పండుగ జరుపుకోనున్నారు.

బర్సానా, నందగావ్‌లలో ఆడే హోలీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం హోలీ రోజున బర్సానాలో రాధా, గోపికలతో శ్రీ కృష్ణుడు తన స్నేహితులతో కలిసి హోలీ ఆడటం ప్రారంభించారు. హోలీ ఆడుతున్న సమయంలో శ్రీ కృష్ణుడు.. గోపికలను ఏడిపించడం ప్రారంభించాడు. అప్పుడు రాధా రాణి, గోపికలు .. శ్రీ కృష్ణుడిని, అతని స్నేహితులను కర్రలతో కొట్టడానికి ప్రయత్నిస్తూ వారి వెంట కర్రలతో పరిగెత్తారు. అప్పటి నుంచి బర్సానా, నంద్ గ్రామంలో లఠ్మార్ హోలీ ఆడటం.. అది కూడా కర్రలతో హోలీ వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

బర్సానాలో లడ్డుమర్ హోలీ.. లడ్డూమర్ హోలీని రాధా రాణి జన్మస్థలమైన బర్సానాలో ఘనంగా జరుపుకుంటారు. ఈ హోలీ వెనుక ఒక కథ ఉంది. ఒకసారి రాధా రాణి తన స్నేహితులతో కలిసి హోలీకి కృష్ణుడిని ఆహ్వానించడానికి నందగావ్ వెళ్ళిందని నమ్ముతారు. హోలీ ఆడటానికి బర్సానా నుంచి వచ్చిన ఆహ్వానాన్ని సంతోషంగా కృష్ణుడి అంగీకరించాడని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడు నంద గావ్ లో అడుగు పెట్టినప్పుడు కొంతమంది గోపికలు కృష్ణుడిపై సరదాగా రంగులు చల్లారు.. అయితే రంగులు లేని పూజారి లడ్డూలు కృష్ణుడిపై విసిరారు. ఆ విధంగా లడ్డూ మార్ హోలీ సంప్రదాయం మధుర బర్సానాలోని శ్రీ జీ ఆలయంలో కేంద్రీకృతమై ప్రారంభమైంది.

హంపిలో హోలీ..హంపి కర్ణాటకలోని విజయనగరం జిల్లాలో ఉంది. ఇక్కడ హోలీ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. హోలీ నాడు ఇక్కడ జానపద పాటలు పాడతారు. నృత్యం చేస్తారు. ఇక్కడ హోలీ ఆడిన తర్వాత, ప్రజలు తుంగభద్ర నదిలో స్నానం చేస్తారు. హంపి హోలీలో విదేశీ పర్యాటకులు కూడా పాల్గొంటారు.

కుమావున్లో హోలీ..ఉత్తరాఖండ్‌లోని కుమావున్‌లో హోలీ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మూడు రకాలుగా హోలీ వేడుకలను జరుపుకుంటారు. మొదటిది కూర్చునే హోలీ, రెండవది నిలబడి ఉండే హోలీ, మూడవది మహిళల హోలీ. ఇక్కడ హోలీ వేడుకల్లో రంగులు మాత్రమే కాదు సంగీతం కూడా ఉంటుంది. కుమావున్ హోలీలో సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది. పాటలు శ్రావ్యత, వినోదం, ఆధ్యాత్మికతను కలిగి ఉంటాయి

గోవాలో హోలీ.. హోలీ సమయంలో గోవాలో షిగ్మోత్సవ్ జరుగుతుంది. షిగ్మో పండుగ హిందువుల పౌరాణిక అంశాలకు అనుసంధానం చేస్తూ శీతాకాలం నుండి వసంతకాలం వరకు కాలానుగుణ మార్పును సూచిస్తుంది.. ఈ షిగ్మోత్సవ్ 14 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రతి నగరంలో సంగీత కార్యక్రమాలు, సాంప్రదాయ జానపద నృత్యాలు నిర్వహించబడతాయి. నగరం అంతటా టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. దేవాలయాల్లో పూజలు జరుపుతారు. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు గోవాలో హోలీ వేడుకలను చూడటానికి వస్తారు.




