Chanakya Niti: భర్తలు బహుపరాక్.. మీ భార్య ఇలా ప్రవర్తిస్తుంటే మీ పట్ల అసంతృప్తితో ఉన్నట్లే..
ఆచార్య చాణక్యుడు మంచి అధ్యాపకుడు, గొప్ప పండితుడు. ఒక సామాన్య బాలుడిని ఒక సామ్రాజ్యానికి రాజుగా చేసిన అసామాన్య తెలివి తేటలు కలిగిన రాజనీతజ్ఞుడు. మనిషి జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని తెలియజేస్తూ నీతి శాస్త్రం రచించాడు. జీవితాన్ని సుఖ సంతోషాలతో గడిపేందుకు మంచి చెడుల గురించి ఈ నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. అవి నేటి తరానికి కూడా అనుసరణీయం అని పెద్దలు చెబుతారు. అలా చాణుక్యుడు చెప్పిన విషయాల్లో ఒకటి భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం గురించి. ఈ రోజు భర్త పట్ల అసంతృప్తిగా ఉన్న భార్య ప్రవర్తన ఎలా ఉందో చాణుక్యుడు చెప్పిన విషయాలు తెలుసుకుందాం..

ఆచార్య చాణక్యుడు మంచి ఆర్ధిక వేత్త మాత్రమే కాదు.. గొప్ప పండితుడు.. మంచి వ్యూహ కర్త.. మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తూ నీతి శాస్త్రం రచించాడు. మనిషి సంతోషంగా జీవించడానికి నీతి శాస్త్రంలో చెప్పిన సూత్రాలు అనుసరిస్తే చాలు. అందుకే నేటికీ అవి మానవ జీవితంపై ప్రభావవంతంగా పని చేస్తాయి. అలా చాణుక్యుడు చెప్పిన విషయాల్లో ఒకటి భార్య ప్రవర్తన గురించి. భార్య తన భర్తపై అసంతృప్తితో ఉన్న సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని.. చాణక్యనీతిలో పేర్కొన్నాడు. ఈ లక్షణాలను అర్ధం చేసుకున్న భర్త ముందే జాగ్రత్త పదాలని సూచించాడు. లేదంటే ఆ భర్త అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ రోజు చాణుక్యుడు చెప్పిన విధంగా భర్త పట్ల అసంతృప్తి ఉన్న భార్య ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటుందో తెలుసుకుందాం..
భర్త ప్రవర్తనతో అసంతృప్తి ఉన్న భార్య.. అకస్మాత్తుగా భర్తతో మాట్లాడడం మానేస్తుంది. అంతేకాదు కోపంతో చిన్న చిన్న విషయాలకు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఇలాంటి లక్షణాలు కనుక భార్యలో కనిపిస్తే.. ఆ భర్త జాగ్రత్త పడాలి. తన భార్య ఎందుకు అలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. భార్యతో మాట్లాడి ఆమె అసంతృప్తిని దూరం చేయాలనీ సూచించాడు చాణక్యుడు.
వాస్తవానికి భర్త పట్ల ప్రేమ ఉన్న భార్య తన భర్తను బాధపెట్టడానికి ఇష్టపడదు. ఒకవేళ మీ భార్య కనుక అకారణంగా కోపగించుకుంటున్నా.. కారణం లేకుండా గొడవ పడుతున్నా.. ఆ భార్య తన పట్ల అసంతృప్తిగా ఉందని భర్త అర్ధం చేసుకోవాలి.
భర్త అవసరాలను గుర్తించి ముందే తీర్చే భార్య.. అకస్మాత్తుగా భర్తకు దూరంగా ఉంటే ఆమె తన గురించి ఆలోచిస్తుందని.. లేదా భర్తని పట్టించుకోవాలని కోవడం లేదని అర్ధం. భార్య ఏదో కారణంతో తనపై అసంతృప్తిగా ఉందని అర్థం చేసుకోవాలట భర్త.
కుటుంబంలోని సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు, మనస్పర్థలు సహజం. అందులోనూ భార్యాభర్తలు మధ్య చిన్న గొడవలు, అలకలు సర్వ సాధారణం. అయితే వాటిని భార్య భర్తలు మనసుకు తీసుకునే విధానం బట్టి అవి సమసిపోతాయి. ఒకవేళ భార్య ఏదైనా కారణంతో భర్తపై కోపం, సహనం ప్రదర్శిస్తుంటే .. అప్పుడు ఆమె సమస్యను అర్థం చేసుకోవాలి.. ఆ సమస్యని పరిష్కరించడానికి ఆ భార్య ప్రవర్తించాలి. అప్పుడే భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు ఏర్పడవు. మనస్పర్థలు ఏర్పడకుండా సంతోషంగా జీవిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు