- Telugu News Photo Gallery Spiritual photos Surya and shaneshwara conjunction: Surya Shani Conjunction these four zodiac signs get good luck
Surya Shani Conjunction: త్వరలో రవి, శనీశ్వరుల కలయిక.. ఈ 4 రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలకు, రాశులకు విశేష ప్రాముఖ్యత ఉంది. గ్రహాల కదలిక మనిషి మంచి చెడులపై ప్రభావం చూపిస్తుందని నమ్మకం. నవగ్రహాలకు అధినేత సూర్యుడు దాదాపు 30 ఏళ్ల తర్వాత శనిశ్వరుడు మీన రాశిలో కలవనున్నారు. ఈ తండ్రి కొడుకుల అరుదైన కలయిక వలన కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకుని రానుంది. ఈ రోజు సూర్యుడు, శనీశ్వరుడు కలయిక వలన ఏ రాశులకు అదృష్టం తీసుకుని రానుందో తెలుసుకుందాం..
Updated on: Mar 03, 2025 | 11:44 AM

గ్రహాలు నిర్ణీత సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి. ఇలా గ్రహాల కదలికల వలన కొన్ని రాశుల్లో సంయోగాలు ఏర్పడతాయి. ఈ యోగాల ప్రభావం ప్రతి రాశిపై పడుతుంది. ఈ యోగాలు కొన్ని రాశులకు అదృష్టాన్ని, అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తే.. మరికొన్ని రాశులకు కష్టాలు కలిగిస్తాయి. అయితే నవగ్రహాధి నేత సూర్యుడు, కర్మ ప్రధాత శనీశ్వరుడు 30 సంవత్సరాల తరువాత మీన రాశిలో కలవబోతున్నారు. సూర్యుడు కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి హోళీ పండగ రోజున ప్రవేశిస్తాడు. అంటే 2025 మార్చి 14 శుక్రవారం సాయంత్రం 6. 58 గం. సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. శనీశ్వరుడు మార్చి 29 శనివారం రాత్రి 11గం. మీన రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో మార్చి 29న సూర్యుడు, శని సంగమం ఏర్పడనుంది. ఈ అరుదైన తండ్రి తనయుడి సంయోగం కారణంగా నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు పట్టిందల్లా బంగారమే.. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

వృషభ రాశి: వృషభ రాశిలోని పదకొండవ స్థానంలో సూర్యుడి, శని సంయోగం ఏర్పడనుంది. ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక వలన ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతేకాదు ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు పెట్టుబడుల వలన మంచి ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశికి చెందిన భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు. వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. స్టూడెంట్స్ కు శుభ సమయం. విదేశాలకు వెళ్లాలనుకునే స్టూడెంట్స్ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథున రాశి: ఈ రాశిలో పదో స్థానంలో సూర్యుడు-శని సంయోగం జరుగనుంది. ఈ రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు ప్రశంసలు లభిస్తాయి. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులతో మంచి గుర్తింపు పొందుతారు. వీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్య నుంచి బయట పడతారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

తులా రాశి: ఈ రాశిలో ఎనిమిదవ స్థానంలో సూర్య-శని సంయోగం ఏర్పడుతుంది. ఈ సూర్య, శనిల కలయిక వలన ఈ రాశికి చెందిన వ్యక్తులకు అనేక ప్రయోజనాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో వీరి అనారోగ్య సమస్యలు తీరి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. ఆర్ధిక సమస్యలు తీరతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివిధ మార్గాల్లో ఆదాయం పొందుతారు.

కుంభ రాశి: ఈ రాశిలో రెండవ స్థానంలో సూర్య,శని సంయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వారు భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందుతారు. అంతేకాదు తమ పూర్వీకుల ఆస్తుల ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఉపశమనం నుంచి లభిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు.




