Saturday Tips: శనివారం రోజున పొరపాటున ఈ 7 పనులు చేస్తే.. జీవితంలో కష్టాలకు వెల్కం చెప్పినట్లే..
జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడు కర్మ ప్రదాత. న్యాయాధిపతిగా పేర్కొంది. జ్యోతిషశాస్త్రంలో శనిశ్వరుడిని అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. శని దేవుడు మంచి చెడుల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. అయితే అదే సమయంలో కొన్ని పనులు చేస్తే చాలా కోపంగా ఉంటాడు. అటువంటి పరిస్థితిలో శనీశ్వరుడు ఆగ్రహాన్ని ఎదుర్కోకూడదనుకుంటే.. కొన్ని ముఖ్యమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో వచ్చే కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

హిందూ మతంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేశారు. శనివారం సూర్య భగవానుడి కుమారుడు శనీశ్వరుడు రోజుగా పరిగణించబడుతుంది. శనీశ్వరుడు కర్మలను అనుసరించి శిక్షలను ఇచ్చే న్యాయ దేవుడు అని చెబుతారు. శని దేవుడు కర్మ ఆధారిత గ్రహం. అయితే శనీశ్వరుడు అనుగ్రహం కొన్ని పనులు చేయడం వలన కలిగితే.. అంటే కష్టపడి పనిచేసి వ్యక్తుల పట్ల, పేదలకు సహాయం చేవారి పట్ల శనీశ్వరుడు అనుగ్రహం చూపిస్తాడు. అదే సమయంలో ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే.. శని దేవుడు కూడా అతన్ని శిక్షిస్తాడు. ముఖ్యంగా శనివారం రోజున కొన్ని పనులు చేస్తే శనీశ్వరుడికి కోపం వస్తుంది.. అటువంటి వ్యక్తుల జీవితంలో కష్టాలను కల్పిస్తాడు. ఈ రోజు శనివారం రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గడ్డం, జుట్టు, గోర్లు కత్తిరించవద్దు
హిందూ మత గ్రంథాలలో శనివారం గడ్డం, జుట్టు, గోర్లు కత్తిరించడం నిషేధించబడింది. శనివారం గడ్డం, జుట్టు, గోళ్లు కత్తిరించుకుంటే శని దేవుడు కోపగించుకుంటాడని నమ్మకం. శనివారం ఈ పని ఎవరు చేసినా, శనీశ్వరుడు వారిని ఇబ్బంది పెడతాడు.
కూతురిని అత్తమామల ఇంటికి పంపకండి.
శనివారం నాడు తల్లిదండ్రులు తమ కూతురిని అత్తారింటికి పంపకూడదని నమ్ముతారు. శనివారం రోజున కూతురును అత్తమామల ఇంటికి పంపితే.. ఆమె వైవాహిక జీవితం బాగా ఉండదని.. భార్యాభర్తలు మధ్య వివాదాలు ఏర్పడి విడిపోవడానికి దారితీస్తుందని అంటారు.
నూనె, నల్ల మినపప్పు కొనకండి.
శనివారం నూనె, నల్ల మినపప్పు కొనడం మానుకోవాలి. శనివారం నూనె, నల్ల మినపప్పును కొనే వారిపై శనీశ్వరుడు కోపంగా ఉంటాడని నమ్ముతారు. అయితే ఈ రోజున నూనె, నల్ల మినపప్పును దానం చేయడం వలన విశేష ఫలితాలను ఇస్తాడు.
మాంసం, మద్యం వినియోగం నిషేధం
శనివారం పొరపాటున కూడా మాంసం, మద్యం తినకూడదు. శనివారం ఇలా చేసే వారిపై శని దేవుడు చాలా కోపంగా ఉంటాడు. అటువంటివారిని జీవితంలో కష్టనష్టాల పాలు చేస్తాడు.
పేదలను వేధించవద్దు
శనీశ్వరుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు. కనుక శనివారం నాడు పేదలను, నిస్సహాయులను వేధించకూడదు. ఇలా చేసేవారు శని దేవుని తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అతని జీవితంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.
ఉప్పు కొనవద్దు
శనివారం ఉప్పు కొనవద్దు. ఈ రోజున ఉప్పు కొంటే అశుభ సంఘటనలు జరుగుతాయని నమ్మకం. శనివారం ఉప్పు కొనే వారిపై శని దేవుడికి కోపం వస్తుంది. ఇలా చేసేవారు శనిదేవుని చెడు దృష్టి పడుతుంది.. అంతేకాదు ఆయన ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
ఇనుము కొనవద్దు
శనీశ్వరుడికి ఇనుప లోహం అంటే ఇష్టం. అయితే శనివారం ఇనుము కొనడం, అమ్మడం నిషేధించబడింది. అంతే కాదు ఈ రోజు ఇనుమును ఇంటికి తీసుకురావద్దు. ఇలా చేయడం వల్ల శని దేవుడు కోపంగా ఉంటాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు