AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indrakeeladri Saree Scam: చీరల దొంగలు ఎవరు..? ఇంద్రకీలాద్రిలో స్కామ్‌పై మరోసారి విచారణ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై చీరల స్కామ్‌పై అధికారులు విచారణ చేపట్టారు. ఆలయంలో పలు రకాల ఫైల్స్‌ సేకరించిన ఎండోమెంట్‌ ఆఫీసర్స్‌.. దుర్గమ్మ చీరల దొంగలను పని పట్టేందుకు రెడీ అవుతుండడం హాట్‌టాపిక్‌గా మారుతోంది. . కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక విజయవాడ దుర్గగుడిలో ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టింది.

Indrakeeladri Saree Scam: చీరల దొంగలు ఎవరు..? ఇంద్రకీలాద్రిలో స్కామ్‌పై మరోసారి విచారణ..
Indrakeeladri Temple Sari Fraud
Shaik Madar Saheb
|

Updated on: Mar 08, 2025 | 7:43 AM

Share

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని అమ్మవారి చీరల కుంభకోణంపై మరోసారి ఎంక్వైరీ కొనసాగుతోంది. ఏపీ దేవదాయ ధర్మదాయ శాఖ నియమించిన ప్రత్యే కమిటీ.. ఇంద్రకీలాద్రికి చేరుకుని చేరుకుని అమ్మవారి శారీస్‌ స్కామ్‌ లెక్కలు తేల్చేందుకు వివరాలు సేకరించారు. ఆలయంలోని ఫైల్స్‌ను సేకరించిన అధికారులు.. వాటి ఆధారంగా ఇవాళ కూడా విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. 2018-19 సంవత్సరంలో సుమారు 1.68కోట్ల విలువైన చీరలకు సంబంధించిన లెక్కల్లో అవకతవకలు జరిగాయని అప్పటి ఎగ్జిక్యూటివ్ అధికారి సురేష్‌బాబు.. ఆ విభాగానికి సంబంధించిన గుమస్తా సుబ్రహ్మణ్యంపై సస్పెన్షన్ వేటు వేశారు. సురేష్‌బాబు తర్వాత ఈఓగా పనిచేసిన భ్రమరాంబ కూడా చీరల స్కామ్‌ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఏఈఓ సుధారాణి విచారణాధికారిగా ఎంక్వైరీ పూర్తి చేసి నివేదికను రూపొందించారు. దాని ప్రకారం లెక్కల్లో అవకతవకలు ఉన్నాయని నిర్ధారించారు.

ఏకంగా పదుల సంఖ్యలో చీరలు కనిపించకుండా పోయాయని అధికారులు తేల్చారు. చీరల విభాగంలో పక్కదారి పట్టించిన 1.68 కోట్లను తిరిగి దేవస్థానానికి తిరిగి కట్టించాలని కమిటీ సూచించింది. అప్పట్లో సస్పెండ్‌ అయిన గుమస్తా సుబ్రహ్మణ్యంకి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ.. అతను కోర్టును ఆశ్రయించడంతో మరోసారి నోటీసు ఇచ్చి సంజాయిషీ తీసుకోవాలని ఆదేశించింది. అయితే.. మారిన రాజకీయ పరిణామాలతో కొందరు పెద్దలను ప్రసన్నం చేసుకుని మళ్లీ విధుల్లో చేరిపోయారు.

పక్కాగా ఆధారాలతో అక్రమాలు తేలినా ఒక్క రూపాయి కట్టించకపోవడంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. గుమస్తా సుబ్రహ్మణ్యం మాత్రం దేవస్థానానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా 5కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్తే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో.. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక విజయవాడ దుర్గగుడిలో ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టింది. సదరు కమిటీ విచారణ కోసం ఇంద్రకీలాద్రికి వెళ్లడంతో దుర్గమ్మ చీరల స్కామ్‌ ఆసక్తి రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు